ఇన్‌స్టాలో పరిచయం, 17 ఏళ్ల బాలుడితో 17 ఏళ్ల బాలిక శారీరకంగా కలిసారు, గర్భం దాల్చింది

ఐవీఆర్
గురువారం, 30 అక్టోబరు 2025 (17:10 IST)
సోషల్ మీడియాను సరిగా వినియోగించుకుంటుంటే జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. అదే మీడియాను వక్రమార్గాల్లో ఉపయోగిస్తే జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పరిచయాలతో కొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరులో జరిగింది.
 
పూర్తి వివరాలు చూస్తే... గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసు స్టేషను పరిధిలో కోబాల్ట్ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ఇన్‌స్టాలో పరిచయం చేసుకున్నది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఆ హద్దు దాటేసి శారీరక కలయిక వరకూ వెళ్లింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిసారు. దీనితో బాలిక గర్భం దాల్చింది. 
 
బాలికను కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు సంగతి బయటకు వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో ఇద్దరిదీ తప్పు కనుక బాలికపైన కూడా కేసు పెట్టాలంటూ పలువురు నెటిజన్లు వాదిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోని తల్లిదండ్రులకు ఇలాంటి ఘటనలు వార్నింగ్ లాంటివని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments