Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్కపై నింద మోపకండి... గంగూలీ వ్యాఖ్య..!

అనుష్కపై నింద మోపకండి... గంగూలీ వ్యాఖ్య..!
, శుక్రవారం, 27 మార్చి 2015 (17:17 IST)
ప్రపంచకప్ సెమీస్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వైఫల్యానికి అనుష్కపై నింద మోపవద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరాడు. విరాట్ వైఫల్యానికి అనుష్కనే కారణమంటూ ట్వీట్టర్‌లో వస్తున్న విమర్శలపై ఆయన స్పందించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ ఓటమికి అనుష్క కారణం కాదన్నాడు. 
 
అపరిపక్వతతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డాడు. అనుష్కపై ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించేవిగా ఉన్నాయన్నాడు. 'అనుష్క చేసిన తప్పేంటి. ఇతర ఆటగాళ్ల కుటుంబ సభ్యుల మాదిరిగానే సిడ్నీ మ్యాచ్ చూడడానికి వచ్చింది. కోహ్లి వైఫల్యానికి ఆమెను నిందించడం సరికాదు. విమర్శకుల అపరిపక్వతకు ఇది నిదర్శనం' అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
 
కోహ్లి, అనుష్క ప్రేమించుకోవడం తప్పుకాదని అన్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన వరల్డ్ కప్ సెమీస్ ఫైనల్లో కోహ్లి ఒకే ఒక్క పరుగు తీసి విఫలమవడంతో అనుష్క శర్మపై ట్విటర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి.

Share this Story:

Follow Webdunia telugu