Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ ఇంటివాడవుతున్న రోహిత్ శర్మ... చిన్ననాటి స్నేహితురాలే వధువు..!

ఓ ఇంటివాడవుతున్న రోహిత్ శర్మ... చిన్ననాటి స్నేహితురాలే వధువు..!
, ఆదివారం, 3 మే 2015 (14:49 IST)
భారత యంగ్ క్రికెటర్లకు పెళ్లి ఘడియలు దగ్గరైనట్లున్నాయి. ఒకొక్కరు ఓ ఇంటివారుగా మారుతున్నారు. ఇటీవల సురేశ్ రైనా వివాహం చేసుకోగా, తాజాగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆయన ప్రియురాలు రితికా సాజ్దే‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ రోహిత్ ఆదివారం ట్విట్టర్‌లో ఆమె ఫొటోలను పోస్ట్ చేశాడు.
 
రితికా ఎవరో కాదు. రోహిత్ చిన్ననాటి స్నేహితరాలట. వీరిద్దరు గత ఆరు సంవత్సరాలుగా చాలా చనువుగా ఉంటున్నారని తెలుస్తోంది. చిన్నప్పుటి నుంచి కలిసి తిరిగిన వీరిద్దరి మధ్య అప్యాయాతానురాగాలకు కొదవేలేదంట. తనను బాగా అర్ధం చేసుకున్న స్నేహితురాలే భార్యగా వస్తుండడంతో రోహిత్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడట. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. ఈ సందర్భంగా వారికి అభినందనల ట్వీట్స్ వెల్లువెత్తాయి.

Share this Story:

Follow Webdunia telugu