Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత సంతతి క్రికెటర్ దారుణ హత్య: ప్రాణ స్నేహితుడే హంతకుడు!

భారత సంతతి క్రికెటర్ దారుణ హత్య: ప్రాణ స్నేహితుడే హంతకుడు!
, మంగళవారం, 17 నవంబరు 2015 (13:34 IST)
భారత సంతతికి చెందిన ఓ మానసిక వికలాంగ క్రికెటర్ దక్షిణాఫ్రికాలో తన ప్రాణ స్నేహితుడి చేతిలోనే హతమైనాడు. ప్రాణ స్నేహితుడే అతడిని అడవిలోకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా కత్తితో తలను నరికి హత్య చేశాడు. నవాజ్ ఖాన్ (23) అనే భారత సంతతి యువకుడు వికలాంగుడైన క్రికెట్‌లో రాణిస్తున్నాడు. తనదైన శైలిలో రాణిస్తున్న నవాజ్ ఖాన్ 2013 ఏడాదికి సంబంధించి వికలాంగ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా అవార్డు కూడా అందుకున్నాడు. 
 
సదరు అవార్డును తన అభిమాన క్రికెటర్ ఆమ్లా చేతుల మీదుగా అందుకున్న నవాజ్ ఖాన్ తెగ సంబరపడిపోయేవాడని తెలిసింది. అయితే నవాజ్ ఖాన్‌కు తండోవాఖే (21) అనే ప్రాణ స్నేహితుడే యముడయ్యాడు. భూత వైద్యుడి మాటలు విని.. తన ఇంటికి దగ్గర్లో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి కత్తితో తల నరికేశాడు. ఆపై పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసుపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu