ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వర్షం కురిపిస్తోన్న వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ సీజన్ 5లో ఆడనున్నాడు. బీబీఎల్ సీజన్ 5లో మెల్ బోర్న్ రెనిగేడ్స్ తరపున ఆడేందుకు క్రిస్ గేల్ సంతకం చేశాడని రెనిగేడ్స్ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి గేల్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగుతాడని రెనిగేడ్స్ తెలిపింది. 2015-16కు రెనిగేడ్స్ తరపున బిగ్ బాష్‌లో ఆడేందుకు గేల్ ఒప్పందం చేసుకున్నట్టు ఆ ఫ్రాంఛైజీ వెల్లడించింది.
కాగా క్రిస్ గేల్‌పై రికార్డులు ఎన్నో వున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఫోర్లు, సిక్సర్లతో సెంచరీ సాధించిన ఆటగాడిగా పేరున్న క్రిస్ గేల్.. వరల్డ్ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 138 బంతుల్లో గేల్ 215 పరుగులు సాధించాడు. ఐసీసీ ట్వంటీ-20 ప్లేయర్ల ర్యాకింగ్స్లో క్రిస్ గేల్ ఆరో స్థానంలో ఉన్నాడు.