వన్డే జట్టులో స్థానం కావాలా.. అయితే కోహ్లీ, రోహిత్ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..

సెల్వి
బుధవారం, 12 నవంబరు 2025 (13:10 IST)
టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి టీమిండియా వన్డే జట్టులో స్థానం దక్కాలంటే.. వారిద్దరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో వారి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిర్ధారించుకోవడానికే బోర్డు ఈ నిబంధన విధించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక జరగనున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ ఆడాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఇక బీసీసీఐ ఆదేశాలకు రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు తాను అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు సమాచారం ఇచ్చాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన లభ్యతపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments