పిల్లలు బిస్కెట్లు అధికంగా తీసుకుంటున్నారా? అయితే డేంజరే అంటున్నారు వైద్యులు. చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అలాంటిది బిస్కెట్లను రెండుకు మించి ఒకే సమయంలో ఎక్కువ తీసుకుంటే ఆకలి లేమి ఏర్పడుతుంది. తద్వారా ఇతర ఆహారాన్ని తీసుకోవడంలో పిల్లలు ఆసక్తి చూపరు. సాధారణంగా బిస్కెట్లతో పోల్చితే క్రీమ్ బిస్కెట్లు ఇంకా ప్రమాదకరం.
క్రీమ్ బిస్కెట్లలో చేర్చే ఫ్లేవర్లు, రంగుల్లో పూర్తిగా రసాయనాలు వుంటాయి. అందులో రుచి కోసం సుక్రోస్ అధికంగా వుండటం, తెలుపు పంచదారను చేర్చడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ క్రీమ్ బిస్కెట్లు తీసుకోవడం ద్వారా వయో బేధం లేకుండా అందరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ బిస్కెట్లను తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి. ఉప్పు చేర్చే బిస్కెట్లలో సోడియం కార్బొనేట్ రక్తపోటును పెంచుతుంది. రోజూ క్రీమ్ బిస్కెట్లు, ఉప్పు చేర్చే బిస్కెట్లను తీసుకుంటే పిల్లల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.
ఇంకా బిస్కెట్లను మైదా పిండితో తయారు చేయడం ద్వారా, పిల్లల్లో మలబద్ధం తప్పదు. గ్లాసుడు పాలతో రెండు బిస్కెట్లను పిల్లలు తీసుకుంటే శరీరంలో అనవసరపు కొవ్వు చేరుతుంది. పిల్లలు చురుకుగా వుండరు. అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో షుగర్ ఫ్రీగా వుంటాయి. ఇందులో సుక్రోస్ లేకపోయినా.. దానికి బదులు షుగర్ ఫ్రీ మాత్రలను, కార్న్ పిండి, షుగర్ సిరప్‌లను చేర్చుతారు. ఇవి శరీర మెటబాలిజం స్థాయిలను తగ్గిస్తాయి. కాలేయంలో సమస్యలను పెంచుతాయి.
అందుచేత పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని, ఇంట్లో తయారు చేసే స్నాక్స్‌ను ఇవ్వడం మంచిది. పెరిగే పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడాన్ని తల్లిదండ్రులు అలవాటు చేయకపోవడం మంచిదని పీడియాట్రిస్టులు సెలవిస్తున్నారు.