Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సీతమ్మ..' అంజలి డైరెక్టర్ కళాంజియమ్ తృటిలో ఎస్కేప్... ప్రకాశం జిల్లాలో...

'సీతమ్మ..' అంజలి డైరెక్టర్ కళాంజియమ్ తృటిలో ఎస్కేప్... ప్రకాశం జిల్లాలో...
, గురువారం, 21 ఆగస్టు 2014 (13:39 IST)
జర్నీ ఫేం అంజలితో వివాదం సాగిస్తున్న తమిళ సినీ దర్శకుడు కళాంజియమ్ తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఐతే ఆయన వద్ద సహాయ దర్శకుడుగా పనిచేస్తున్న అరుణ్ కుమార్ మృత్యువాత పడ్డాడు. వివరాలు చూస్తే... తమిళ దర్శకుడు కళాంజియం తన సహాయ దర్శకులతో కలిసి రాజమండ్రిలో తమ స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. వీరందరూ రాజమండ్రి నుంచి స్కార్పియో వాహనంలో తిరిగి చెన్నైకు బయలుదేరారు. 
 
ఐతే వీరి వాహనం ప్రకాశం జిల్లా జాతీయ రహదారి మద్దిపాడు వద్దకు రాగానే కారు ముందు టైరు పంక్చరై పేలిపోయింది. దీనితో వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం డివైడర్ ను ఢీకొని రోడ్డుకి అవతలివైపుకు పల్టీ కొట్టింది. ఈ సమయంలో కారు డోర్ తెరుచుకోవడంతో సహాయ దర్శకుడు అరుణ్ కుమార్ రోడ్డుపై విసిరివేయబడ్డాడు. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
మరో సహాయ దర్శకుడు శంకర్ తీవ్రంగా గాయపడగా కళాంజియమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరో ఇద్దరు కూడా చిన్నచిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu