Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటోవాలా మానవత్వం అదుర్స్: నిజమైన హీరో.. ఆటోను అమ్మేసి..?

ఆటోవాలా మానవత్వం అదుర్స్: నిజమైన హీరో.. ఆటోను అమ్మేసి..?
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (12:47 IST)
ఆటోవాళ్లు అనగానే అందరికి మొదట గుర్తుకొచ్చేది తాగుబోతులు, కఠినంగా వ్యవహరించే వారని అందరూ అనుకుంటారు. కాని దీనికి మారుపేరుగా ఓ ఆటోవాలా ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి నిజమైన వీరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. 48 ఏళ్ల రవిచంద్రన్ ఓ రోజు తన ఆటోలో ఓ ప్రయాణికుడిని ఎక్కించుకున్నాడు. ఆ ప్రయాణికుడు అకస్మాత్తుగా గుండెపోటుతో ఆటోలోనే కుప్పకూలిపోయాడు. ఆ టైమ్‌లో ఆటోవాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ప్యాసింజర్‌ను హాస్పటల్‌కు తీసుకెళ్లాడు. 
 
బాధితుడిని పరీక్షించిన వైద్యులు వెంటనే అతనికి పేస్‌మేకర్ అమర్చాలని, లేదంటే ప్రాణాలకే ముప్పని చెప్పారు. సాధారణంగా దాని ఖరీదు లక్ష రూపాయలని, అయితే సబ్సిడీ పోను రూ.47వేలు చెల్లించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఆ ప్రయాణికుడి కుమారుడు కోల్‌కతా నుంచి చెన్నైకి వచ్చాడు. అయితే అతని వద్ద తగినన్ని డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అతని వద్ద రూ.15వేలు మాత్రమే ఉన్నాయి. 
 
అన్ని డబ్బులు చెల్లించే స్తోమత లేదు. వెంటనే తన వద్ద ఉన్న ఆటో రిక్షాను అమ్మేశాడు. అన్నట్టుగానే తన ఆటోను తాకట్టు పెట్టి ఆపరేషన్‌కు అవసరమైన డబ్బును అందించి ఆ ప్రయాణికుడి ప్రాణాలు నిలబెట్టాడు. ఆటోవాలా రవిచంద్రన్ చూపిన దయా గుణం అందరిని అబ్బురపరిచింది. మానవత్వంతో వ్యవహరించిన రవిచంద్రన్‌ను అన్నా ఆటో వెల్ఫేర్ ట్రస్టు ఘనంగా సత్కరించింది.

Share this Story:

Follow Webdunia telugu