Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కిన్ టోనింగ్‌కు నిమ్మ రసం...

స్కిన్ టోనింగ్‌కు నిమ్మ రసం...
, శనివారం, 9 ఏప్రియల్ 2016 (09:55 IST)
ఖరీదైన స్కిన్ టోనర్లకు బదులుగా చర్మానికి నిమ్మకాయ రసాన్ని వాడండని బ్యూటీషన్లు అంటున్నారు. తద్వారా చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని వారంటున్నారు. 
 
అలాగే చర్మం‌పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. 
 
జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖనికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. 
 
ఇంకా తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది. దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది. 
 
మీ చర్మం మెరిసిపోవాలంటే నారింజ రసం తీసుకోండి. దానికి పాలు కలిపి ముఖానికి చేతులకు పట్టించండి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మచ్చలు, చర్మ సంబంధ సమస్యలు మాయమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu