Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్లెలు సౌందర్యానికే కాదు... ఆరోగ్యానికి కూడా... ఎలా అంటే...?

మల్లెలు సౌందర్యానికే కాదు... ఆరోగ్యానికి కూడా... ఎలా అంటే...?
, శుక్రవారం, 3 జులై 2015 (16:24 IST)
మల్లెపూలు స్త్రీలు సౌందర్య సాధనంగా ఉపయోగిస్తుంటారు. అవి సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం... రోజంతా అలసిపోయిన కనులపై మల్లెలను కొద్దిసేపు ఉంచినట్లయితే చలవనిస్తాయి. తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్ర సమస్య తగ్గడమే కాక జుట్టు కూడా పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.
 
కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాక మాడుకు చల్లదనాన్నిస్తుంది.
 
మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి.
 
మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చ సొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లెపూలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పలు ఔషధాలలో మల్లెపూలను వాడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu