కలబంద, ఆముదాన్ని జుట్టుకు పట్టిస్తే..?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (10:43 IST)
స్త్రీలు సాధారణంగా ఒత్తయిన జుట్టుకోసం నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారికి కలబంద ఎంతగానో పనిచేస్తుంది. ఒత్తయిన జుట్టుకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణంగా జుట్టు మొదళ్ల నుండి అమినో ఆమ్లాలు వెలువడుతుంటాయి. ఇదే ఆమ్లం కలబందలో పుష్కలంగా ఉంటాయి. 
 
ఈ కలబంద మిశ్రమాన్ని జుట్టుకు క్రమంతప్పకుండా పట్టించడం వలన జుట్టు పెరగడంతో పాటు పొడిబారడం తగ్గుతుంది. చుండ్రును కూడా అరికడుతుంది. మరి కలబందను ఎలా వాడాలో ఓసారి తెలుసుకుందాం..
 
తాజాగా తీసిన అరకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా ఆముదం, చెంచా మెంతిపిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతివారం చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
తలస్నానం చేసే 10 నిమిషాల ముందు కలబంద గుజ్జును జుట్టుకు రాసుకోవాలి. ఈ గుజ్జులోని ఎంజైమ్‌లు తలలోని మృతుకణాలను తొలగించి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలగిస్తుంది. అంతేకాక తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తుంది.
 
పావుకప్పు కలబంద గుజ్జులో 2 స్పూన్ల్ ఆలివ్ నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుండి జుట్టంతా పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో వివాహ వేడుకలో విషాదం- పుచ్చకాయ తిని బాలుడి మృతి

NEET: నలందలో నీట్ సాల్వర్ గ్యాంగ్ అరెస్ట్.. నగదు, అడ్మిట్ కార్డులు స్వాధీనం

ప్రభుత్వ చీఫ్ విప్‌గా కారు డ్రైవర్ కుమారుడు- అసెంబ్లీలో విజయ్‌కి బలపరీక్ష.. అన్నాడీఎంకే నేతల మద్దతు

తమిళనాడు సీఎంకి స్పెషల్ ఆఫీసర్‌గా జ్యోతిష పండితుడు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్న ఉదయనిధి

Chain Snatching: వరంగల్‌లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi's Photos: చిరంజీవి ఫొటో లకు నెటిజన్లు ఫిదా - బాబీ సినిమా కోసమే

Jayasudha: రమణి కళ్యాణం సినిమా చూశా,మంచి ఫీల్‌గుడ్ మూవీ : జయసుధ

Nani: నేచురల్ నాని ది పారడైజ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Exhibitors Association: సింగిల్ థియేటర్లు మూతపడుతున్నాయ్ బతికించండి అంటూ ఎగ్జిబిటర్లు ఆవేదన

Aadi Saikumar : శంబాల కాంబినేషన్ లో యగంధర్ ముని నూతన చిత్రం

తర్వాతి కథనం