ముఖంలో మిగతా ప్రదేశాల్లోని చర్మం కంటే కంటి కింద చర్మం సున్నితంగా, పలుచగా ఉంటుంది. ఇక్కడి చర్మంలో నూనె గ్రంథులు ఉండవు. అందువల్ల ఏమాత్రం అలసిపోయినా కంటి కింద చర్మం కమిలిపోయినట్లు నల్లగా మారిపోతుంది. మరీ పని ఒత్తిడి, కళ్లకు విపరీతమైన శ్రమకు గురిచేసేవారి కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. ఇలా ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లు కనబడుతారు. కాబట్టి కళ్ల కింద నల్లని వలయాలను నివారించేందుకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
కళ్ల చుట్టూ స్వచ్ఛమైన ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసి తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇందుకు ఉంగరం వేలిని ఉపయోగిస్తూ ఒక్కో కంటికి ఒక్కో నిమిషం చొప్పున చేసి 15 నిమిషాలు అలా వదిలేసి, తడి దూదితో తుడిచేయాలి. ఇలా కొన్ని రోజులపాటు చేయాలి. కీరా రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకుని కళ్ల కింద రాసి 20 నిమిషాలు ఆగి నీటితో కడిగేయాలి. బయటకు వెళ్లేముందు సన్‌స్క్రీన్‌ను కళ్లకింద అప్లై చేయాలి. ఒక చుక్క నీటిని అద్ది రాయాలి.