మందార ఆకుతో చేసిన టీని తాగితే రక్తపోటు మటాష్..
సౌందర్యానికి సహజసిధ్ధంగా మేలుచేసే సౌందర్య సాధనం మందారం. మందారం పువ్వు ఆడవారి సిగకే కాదు కేశానికి కూడా అందాన్నిస్తుంది. మందారం చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
సౌందర్యానికి సహజసిధ్ధంగా మేలుచేసే సౌందర్య సాధనం మందారం. మందారం పువ్వు ఆడవారి సిగకే కాదు కేశానికి కూడా అందాన్నిస్తుంది. మందారం చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
మందార ఆకుని బాగా ఎండబెట్టి ఆ పువ్వును కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ నూనెను ప్రతిరోజు తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మందార పువ్వుల్నినానబెట్టి జుట్టుకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు మెరిసిపోతుంది.
మందార ఆకుతో చేసిన టీని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మందార ఆకు టీ సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు, దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మందార ఆకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
మందార ఆకులలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది.