Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ప్రతికూలతలు క్రమంగా తొలగుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. అపరిచితులు మోసగించే ఆస్కారం వుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకునిల్వ తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.