Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంప్రదింపులకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గృహమార్పు చికాకు పరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.