Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

తుల
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం డబ్బుకు ఇబ్బందులుండవు. ప్రణాళిక రూపొందించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రియతములకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం కలిసివస్తుంది. బెట్టింగులకు పాల్పడవద్దు.