Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. గృహ మరమ్మతులు చేపడుతారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు.