Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మిథునం
మిథునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్పూర్తిదాయకమవుతుంది. బంధుత్వాలు బలపడుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కష్టమనుకున్న పని తేలికగా పూర్తవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వాహనం ఇతరులకివ్వద్దు.