Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కుంభం
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు వస్త్రప్రాప్తి, వస్తు లాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. కొంత మొత్తం ధనం అందుతుంది. చెల్లలింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పదవులు కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదం చేస్తాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కొత్త సమస్యలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. ప్రియతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు మెరుగైన ఫలితాలిస్తాయి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాలవారికి ఆదాయాభివృద్ధి. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.