Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. స్థిమితంగా వుండటానికి యత్నించండి. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు అదుపులో వుండవు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. వృత్తుల వారికి వారికి సామాన్యం. ఆహ్వానం అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.