Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ మృతిని జీర్ణించుకోలేకపోతున్న తారలు

వైఎస్ మృతిని జీర్ణించుకోలేకపోతున్న తారలు
FILE
నమ్మలేక పోతున్నా: నాగార్జున
వై.ఎస్. ఇక లేరనే విషయం నమ్మలేక పోతున్నా. ఆయనది గ్రేట్ విజన్. భవిష్యత్ ఎలా ఉండాలో ప్రజలకు తెలియజెప్పాలనే ఆరాటంగల వ్యక్తి. ఆయన ఇంకా ఉంటే రాష్ట్రం ఇంకా ముందుకెళ్లేది. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నా.

ఊహించనిది : దాసరి
ఈరోజు ఉదయం కూడా సెక్రటేరియట్‌కు వెళ్లాను. అడవుల్లో చిక్కుకుని ఇంకా బయటకు వస్తారని భావించాను. కానీ ఆయన లేరనే వార్త ఊహించలేకపోయాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్కతాటిపై తెచ్చిన ఘనత ఆయనదే. కాంగ్రెస్ అంటేనే అసమ్మతికి పేరు. అలాంటిది అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టిన కృషీవలుడు వై.ఎస్.

Share this Story:

Follow Webdunia telugu