Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటిని పంచుకుందాం... రండి!!

నీటిని పంచుకుందాం... రండి!!
WD
అంతర్జాతీయ జల దినోత్సవం ప్రతి ఏటా మార్చి 22న జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకించి మంచినీటి యొక్క ప్రాముఖ్యత, నీటిని ఎలా పొదుపుగా వినియోగించుకోవాలనే అంశాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

1992లో తొలిసారిగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫెరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ & డెవలప్‌మెంట్ మంచినీటికి సంబంధించి అంతర్జాతీయంగా అవగాహనను విస్తృతం చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రతి ఏటా మంచినీటిపై ఈ అంతర్జాతీయ నీటి దినోత్సవం రోజున ప్రత్యేకంగా కొన్ని అంశాలపై దృష్టి సారించడం జరుగుతోంది.

ఈ అంతర్జాతీయ జల దినోత్సవ సందర్భంగా "నీటిని పంచుకుందాం - ఆ అవకాశాలు పంచుకుందాం" అంటూ నినదిస్తోంది యునెస్కో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జల వనరులను సద్వినియోగం చేసుకుని సుఖమయ జీవనాన్ని సాగించాలని యునెస్కో పిలుపునిస్తోంది. ముఖ్యంగా జలవనరులు కలిగిన దేశాల నీరు వృధా పోకుండా పొరుగు దేశాలకు సాయపడగల యోచన చేయాలంటోంది.

అలాగే ఆయా దేశాల్లోని రాష్ట్రాలు ఇప్పటికే నీటి కోసం కొట్లాడుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. వెంటనే జల పోరాటాలను ఆపి ఆమోదయోగ్యమైన మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది. పరస్పర అవగాహన ద్వారా ఇది సుసాధ్యం చేసుకోవాలని అంటోంది. మానవుల అవసరాలకు ప్రకృతి ప్రసాదించిన జల వనరులను వృధా పోనివ్వక, కాలుష్యం చేయక పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా యునెస్కో వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu