సొంత ఊరిలో ఉండగా ఓ సారి కిడ్నాప్‌కు గురయిన అనుభవంతో విశ్వసుందరి పోటీల్లో ఒత్తిడిని సునాయాసంగా జయించ గలిగానని మిస్ యూనివర్స్ కిరీటధారిణి మిస్ వెనిజులా డయానా మెండోజా పేర్కొన్నారు. వియత్నాంలో నిర్వహించిన మిస్ యూనివర్స్-2008 అందాల పోటీల్లో మిస్ వెనిజులా అయిన డయానా మెండోజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. వాస్తవానికి అమెరికాకు చెందిన క్రిస్టల్ స్టివార్డ్ ఈ కిరీటాన్ని దక్కించుకుంటుందని తొలుత విశ్లేషించారు. ఫైనల్‌లో గత ఏడాది చేసిన పొరపాటే మళ్లీ పునరావృతం కావడం.. దాంతో ఆదివారం సాయంత్రం జరిగిన పోటీల్లో స్టివార్డ్‌ను వెనక్కు నెట్టి డయానా మెండోజా తెరపైకి వచ్చి అందరి అంచనాలను పటాపంచలు చేసింది. |
ప్రకృతి అందాల్లో మహిళలు కీలక పాత్ర వహిస్తారన్న విషయం తెలిసిందే. మరి ఆ అందాల్లో ఏ అందం గొప్పగా ఉందంటే.. దానికి అందాల పోటీలే శరణ్యం. అందుకే ఈ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా మిస్ యూనివర్శ్, మిస్ వరల్డ్ పోటీలుగా ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తుండటం జరుగుతోంది. |
|
|
టాక్ షో స్టార్ జెర్రీ స్ప్రింగర్, స్పైస్ గర్ల్ మెలానీ బ్రౌన్‌ల నిర్వహణలో సాగిన ఎన్‌బిసి మిస్ యూనివర్స్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లోని కోట్లాదిమంది ఆదివారం సాయంత్రం వీక్షించారు. గత సంవత్సరం విశ్వసుందరి పోటీల విజేత మిస్ జపాన్ రియో మోరీ నుంచి మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకునేందుకు గాను 80 మంది పోటీ దారులు వియత్నాంలోని తీరప్రాంత నగరం నా తరాంగ్‌లో హాజరయ్యారు.
పసుపుపచ్చ, ఆకుపచ్చ, నారింజ రంగుల్లోని బికినీలను ధరించిన 15 మంది సెమీ ఫైనలిస్టులు స్విమ్ సూట్ పోటీల్లో పాల్గొనే క్రమంలో స్టేజిపై చిందులేశారు. స్థానికురాలైన మిస్ వియత్నాం లామ్ తుయ్ ఎన్గుయెన్ స్టేజీ మీద తిరుగాడినంతసేపూ వియత్నాం ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
ఆదివారం సాయంత్రం ముగిసిన తుది గౌను పోటీల్లో వివిధ దేశాల పది మంది సుందరీమణులు పోటీపడ్డారు. అంతర్జాతీయ ప్రముఖ ఫ్యాషన్ నిపుణులు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, టీవీ స్టార్ డొనాల్డ్ ట్రంప్ తదితరుల ఎదుట అందాల భామల ప్రదర్శనలు సాగాయి. ఈ ఏడాది పోటీల్లో విస్తృతమైన అనుభవం మరియు విజయమే లక్ష్యంగా సుందరీమణులు పోటీ పడటం విశేషం.
గత ఏడాది జపాన్‌కు చెందిన రియో మోరీ వారసురాలిగా కిరీటం చేజిక్కించుకున్న తర్వాత 22 ఏళ్ల డయానా విలేకరులతో మాట్లాడారు. సొంత ఊరిలో ఉండగా ఓ సారి కిడ్నాప్ గురయిన ఉదంతంతో ఒత్తిడిని జయించగలిగానని.. అందుకే కిరీటాన్ని గెలుచుకోగలిగానని స్పష్టం చేశారు.
అందంలో ఏ అందం గొప్ప....!
ప్రకృతి కాంత సౌందర్యానికి పులకించిన మేఘం వర్షమై తన ఆనందాన్ని వ్యక్తం చేసిందట. కనుక భువిపై ఉన్నటువంటి అందాలకు ఎన్నడూ కొదవుండదు. అందాన్ని మించిన మరొక అందం ఎక్కడో ఓ చోట ఉండనే ఉంటుంది. అయితే ప్రత్యేకతలు వేరైనా అందంతో పాటు మానవాళికి మానసిక కలిగించే తృప్తిలోని తేడాల కారణంగా వాటి స్థానాలు కూడా మారుతుంటాయి.
ప్రకృతి అందాల్లో మహిళలు కీలక పాత్ర వహిస్తారన్న విషయం తెలిసిందే. మరి ఆ అందాల్లో ఏ అందం గొప్పగా ఉందంటే.. దానికి అందాల పోటీలే శరణ్యం. అందుకే ఈ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా మిస్ యూనివర్శ్, మిస్ వరల్డ్ పోటీలుగా ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తుండటం జరుగుతోంది.