Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వృత్తి కంటే ఇల్లే పదిలమనిపిస్తే....

Advertiesment
వృత్తి కంటే ఇల్లే పదిలమనిపిస్తే....
, శనివారం, 19 జులై 2008 (18:03 IST)
ఇంటి కంటే గుడి పదిలం అనే సామెత ప్రస్తుతం కాస్త తిరగబడుతున్నట్లుంది. ఈ పాత సామెత వృత్తి కంటే ఇల్లు పదిలం అంటూ తన రూపాన్ని ప్రస్తుతం మార్చుకుంటోంది. అమెరికాలో ఎంబీఎ డిగ్రీలు కలిగిన మహిళల్లో చాలామంది ఉద్యోగాలు వదిలేసి ఇంటిపట్టున ఉండిపోవాలని చూస్తున్నట్లు తాజా అధ్యయనం చెప్పింది.
పనిమానేసి ఇంట్లో కూర్చుంటే.....
  అమెరికా అయినా, భారత్ అయినా పిల్లల పెంపకం, కుటుంబ సంరక్షణ అనేది చాలావరకు మహిళల బాధ్యతగానే ఉంటున్న పరిస్థితుల్లో ఆడబాస్ స్థానం నుంచి తల్లి పాత్రలోకి ఒదిగిపోవడం అమెరికన్ మహిళలకు కూడా తప్పేటట్టు లేదనిపిస్తోంది. ఈ విషయంలో అమెరికా, భారత్ దొందూ దొందే మరి...      


అమెరికాలోని హార్వార్డ్ యూనివర్శిటీకి చెందిన వెయ్యిమంది డిగ్రీ విద్యార్థినులను సర్వే చేసిన పరిశోధకులు, ఎంబీఏ మహిళలలో పెరుగుతున్న ఇంటి మమకారం గురించి కొత్త విషయాలు బయటపెట్టారు. డిగ్రీ పూర్తి చేసిన 15 ఏళ్ల తర్వాత చాలా మంది ఎంబీఏ మహిళలు పని మానేసి కుటుంబ సంరక్షణను చేపడుతున్నారని పరిశోధకులు కనిపెట్టారు.

వృత్తి జీవితంలో వత్తిడిని ఎదుర్కోలేకపోతున్న డాక్టర్లు, లాయర్ల కంటే ఎంబీఏ మహిళలే అమెరికాలో కుటుంబాల సంరక్షణ కోసం, పిల్లల పెంపకం కోసం పని మానుకుని ఇంటి బాట పడుతున్నారట.

1988 నుంచి 1991 వరకు గ్రాడ్యుయేట్ క్లాసుల్లో చేరిన మహిళలపై హార్వార్డ్ కాలేజ్ రీయూనియన్ సర్వేలను వోల్‌ఫ్రామ్ అతడి సహచరుడు జేన్ లిబర్ హెర్‌లు నిర్వహించారు. 37 సంవత్సరాల వయస్సు ఉండి కనీసం ఒక బిడ్జను కలిగిన మహిళలనే ఈ సర్వేకి ప్రాతిపదికగా తీసుకున్నారు.

హార్వార్డ్ కాలేజీనుంచి గ్యాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థినుల్లో 28 శాతం మంది 15 సంవత్సరాల తర్వాత, ఇంటిపట్టున తల్లులుగా ఉండిపోతున్నారని ఈ పరిశోధకులు కనుగొన్నారు. కాగా వైద్యవృత్తిలో ఎండీ పూర్తి చేసిన వారిలో 6 శాతమంది మాత్రమే ఇంటి బయట పనిచేయడం నిలిపివేశారని సర్వే చెప్పింది.

సర్వేలో పాల్గొన్న ఎంబీఏ మహిళల్లో 27 శాతంమంది ఫైనాన్షియల్ రంగంలోనూ 17 శాతంమంది కన్సల్టంగ్ రంగంలోనూ వృత్తి జీవితాలు కలిగి ఉండేవారు. ఎండీల్లో చాలామంది మహిళలపై ప్రత్యేకించిన స్పెషాలిటీ కోర్సుల్లో పనిచేసేవారు. వీరిలో 13 శాతం మంది గైనకాలజీలో, 31 శాతం మంది పీడియాట్రిక్ మెడిసన్ మరియు కుటుంబ ఆరోగ్య రంగంలో పనిచేసేవారు.

కెరీర్‌ను దీర్ఘకాలం కొనసాగించడంలో పని పరిస్థితులు కీలకపాత్ర పోషిస్తాయని వోల్‌ఫ్రాం సూత్రీకరించారు. ఇతర రంగాల మహిళల కంటే వైద్య రంగంలోని మహిళలు ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తూనే, పార్ట్ టైమ్ జాబ్‌ను సులభంగా చేయగలుగుతారని ఈయన చెబుతారు.

మరోవైపున వ్యాపార మహిళలయితే దీర్ఘ కాలం పనిలో గడపడం, పదే పదే ప్రయాణాలు చేయడమనే కార్పొరేట్ సంస్కృతికి సాధారణంగా అలవాటుపడిపోతారని వోల్‌ఫ్రాం చెబుతారు. తల్లులయిన మహిళా లాయర్లపై చేపట్టిన సర్వేలో 79 శాంతంమంది, పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగ జీవితాలను కొనసాగించారని తేలింది.

Share this Story:

Follow Webdunia telugu