Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు ఆదర్శం.. సునీతా విలియమ్స్

Advertiesment
తన లక్ష్యం కోసం అలుపెరగక పోరాడి భారతీయ మహిళగా
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2008 (16:25 IST)
ప్రపంచ చరిత్ర పుటల్లో తమకంటూ స్థానం ఏర్పరుచుకున్న మహిళ... నేటికీ సరికొత్త సంచలనాలను సృష్టించి మరణాన్ని కూడా జయించి అంతరిక్షంలో కాలుమోపుతోంది. అడుగడుగునా సమాజంలో ఎన్ని అడ్డంకులు వస్తున్నా.. పవిత్రమైన తన లక్ష్యం కోసం అలుపెరగక పోరాడి భారతీయ మహిళగా, స్త్రీ జాతికి ఆదర్శంగా అలసిపోక, ఆగిపోక నిరంతరం శ్రమించి విజయశిఖరాలను అందుకుంది సునీతా విలియమ్స్.

అమెరికా దేశంలోని ఓహియోలోని యుక్లిడ్‌లో 1965, సెప్టెంబర్ 19న జన్మించిన సునీతా విలియమ్స్ మైకేల్ జే.విలియమ్స్‌ను వివాహమాడి ప్రస్తుతం మస్సాచుసెట్స్‌లో స్థిరపడ్డారు. చిన్నప్పటినుంచి అంతరిక్ష యాత్రలు చేయడమంటే ఎంత ఇష్టమో అలాగే.. స్విమ్మింగ్, పరుగుల పందెం, స్నోబోర్డింగ్, విండ్‌సర్ఫింగ్, బైకింగ్, మరియు బో హంటింగ్ అంటే కూడా ఆసక్తి ఎక్కువ.

1983 సంవత్సరంలో మస్సాచుసెట్స, నేథమ్‌లో గల నేథమ్ హైస్కూల్‌లో విద్యను పూర్తి చేసిన సునీతా.. 1987లో యునైటెడ్ స్టేట్స్ నావల్ ఎకాడమి నుంచి భౌతిక శాస్త్రంలో బి.ఎస్. పట్టాను అందుకుని విజయాల పరంపరకు నాంది పలికారు.అనంతరం అందులోనే నావికా దళంలో విమాన చోదకులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

1995లో ఫోర్లిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో ఎమ్.ఎస్. పట్టాను స్వీకరించారు. ఆ తర్వాత అమెరికా ఎయిర్‌ఫోర్సులో ప్రవేశించిన సునీతా.. దాదాపు 30 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2770 గంటల పాటు నడిపిన అపార అనుభవాన్ని తన సొంతం చేసుకున్నారు.

తన కెరీర్‌లో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న సునీతా 1998 జూన్ మాసంలో ఉత్తర అమెరికా అంతరీక్ష పరిశోధన సంస్థ (నాసా)కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో వ్యోమగామి శిక్షణకై ఆమె హాజరయ్యారు.

శిక్షణ అనంతరం రష్యా దేశం సహకారంతో రష్యా అంతరీక్ష పరిశోధన సంస్థతో కలిసి పని చేసిన సునీత, అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పనిచేసేందుకు ఎంపికైన వ్యోమగామిలో ఒకరిగా నిలిచారు. ఇటీవల నాసా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపిన ఐఎస్ఎస్‌లో ఫ్లైట్ ఇంజినీర్‌గా సునీతా విలియమ్స్ సేవలందించారు.

ఎక్స్‌పెడిషన్-14 సిబ్బందిలో నాలుగు స్పేస్‌వాక్‌లలో మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నిర్వహించిన మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అలాగే అంతరిక్షంలో 195 రోజులు గడపడం ద్వారా షెన్నన్ ల్యూసిడ్ రికార్డును తిరగరాశారు.

అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సునీతా విలియమ్స్, 2007 సంవత్సరం జూన్ 22న భూమికి సురక్షితంగా చేరుకున్నారు. సెప్టెంబర్ 2007లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఆమెకు దేశం యావత్తు ఆదరాభిమానాలతో సగర్వంగా ఆహ్వానం పలికింది. భారత్ చేరిన అనంతరం సునీతా భారత్‌లోని తమ బంధువులను పరామర్శించారు.

అలాగే గుజరాత్‌లో 1915లో మహాత్మాగాంధీచే నిర్మించబడిన సబర్మతీ ఆశ్రమాన్ని కూడా ఆమె సందర్శించారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రవాస భారతీయురాలిగా ఆమె అందించిన విశిష్ట సేవలకు గాను సర్ధార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభా అవార్డు వరించింది. అంతేకాక ఆమె రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కూడా కలుసుకున్నారు. అదేవిధంగా సైన్సు సదస్సులో పాల్గొని అమూల్యమైన సందేశాలను పిల్లలకు అందించారు.

తాను ఎన్ని విజయాలు సాధించినా ఒక మహిళగా అందరి ఆదరాభిమానాలను కోరుకుంటున్నానని.. చెబుతున్న సునీతా.. అంగారక గ్రహంపై కాలు మోపడమే తన తదుపరి లక్ష్యమని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu