దాదాపు 70 సంవత్సరాల వెనుకకు తిరిగి చూస్తే... 1936 సంవత్సరం, స్థలం లాహోర్ ఎయిర్‌పోర్ట్.... 21 సంవత్సరాల మహిళ అంతటి ఘనకార్యం చేస్తుందని ఎవరికీ నమ్మశక్యంకాలేదు. అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తుండగానే... అందంగా ఉన్న ఆమె, అంతకంటే అందమైన కాటన్ చీరను ధరించి ఎంతో ఆత్మవిశ్వాసంతో "టూ సీటర్ జిప్సీమోత్ విమానం"లోని కాక్ పీట్‌లోకి ప్రవేశించింది. కళ్ళజోడును ఒక్కసారి సవరించుకున్న ఆమె తన కళ్లతోటి నీలాకాశాన్ని పరికించి చూసింది. అంతే రివ్వున పైకి ఎగిరిపోయింది. ఆమే... మన సరళా థక్రాల్!సంప్రదాయ సంకెళ్లను తెంచుకుని...! |
|
మహిళలు ఇంటి గడప దాటి బయటకు అడుగు పెట్టడమే మహా అపరాధంగా, మహాపచారంగా భావించే భారతదేశంలోని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో పుట్టింది మన సరళా థక్రాల్. బ్రిటీషువారు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వాణిజ్య విమాన చోదకురాలిగా పని... |
|
|
ఆ రోజు సరళ చేసిన అద్భుతమైన ఫీట్‌ను అప్పటి భారతదేశంలో ఉన్న రాజులు, రాజకుమారులు, రాజకీయ నాయకులు అందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఇంత గొప్ప ఘనతను సాధించిన సరళ జీవిత విశేషాల్లోకి వెళ్తే...
మహిళలు ఇంటి గడప దాటి బయటకు అడుగు పెట్టడమే మహా అపరాధంగా, మహాపచారంగా భావించే భారతదేశంలోని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో పుట్టింది మన సరళా థక్రాల్. బ్రిటీషువారు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వాణిజ్య విమాన చోదకురాలిగా పనిచేసిన ధైర్యశాలి ఈమె.
జన్మించింది జోధ్‌పూర్‌లోనైనా... ఆ తరువాత సరళ కుటుంబం అజ్మీర్ వెళ్లి అక్కడే స్థిరపడింది. అక్కడే పెరిగి పెద్దదైన సరళకు ఒక పైలట్ వరుడైన పి.డి. శర్మతో వివాహం జరిగింది. ఈమె మామగారు కూడా పైలట్ కావడంతో, భర్త మామగార్ల ప్రోత్సాహంతో సరళ ఢిల్లీలో బ్రిటీషువారు నడిపే ఫ్లయింగ్ క్లబ్‌లో సభ్యురాలిగా చేరి శిక్షణ పొందింది.
అప్పటికి మన సరళ వయస్సు ఎంతనుకుంటున్నారు. 21 సంవత్సరాలే. అప్పటికే ఆమెకు నాలుగు సంవత్సరాల కూతురు కూడా ఉండేది. 1000 గంటలపాటు విమానం నడిపిన అనుభవాన్ని సంపాందించిన సరళ "ఎ" లైసెన్స్‌ను పొందింది. పైలట్ తప్ప ఇంకెవ్వరూ ఉండని "సోల్" విమానాన్ని కూడా సరళ సునాయాసంగా నడిపేది. ఆ రోజుల్లో చాలామంది మగవాళ్లు కూడా "సోల్" విమానాన్ని నడిపేందుకు వెనుకాడేవారు. అలాంటిది సరళ ధైర్యంగా నడిపేది.
తన వృత్తి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా ముందుకెళ్ళిన సరళ సొంత జీవితంలో ఏర్పడిన ఆటుపోట్లను, ఎదురైన వివాదాలను ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా ఎదుర్కొన్నారు. ఒకేరోజున ఆమె భర్త, మరిది విమాన ప్రమాదాలలో మరణించినప్పటికీ చెక్కుచెదరలేదు.
ఒకవైపు ఆత్మీయులు మరణించటం, మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం మొదలవటంతో వాణిజ్య విమానాలను ప్రభుత్వం నిషేధించటంతో ఉద్యోగం పోవటం లాంటివి జరిగినా సరళ కృంగిపోలేదు. తరువాత లాహోర్‌లోని ‘వెయె స్కల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరి శిక్షణ పొందింది.
పెయింటింగు, నగల-దుస్తుల డిజైన్లకు రూపకల్పన చేసే సృజనాత్మక శక్తి కలిగిఉన్న సరళకు అదే జీవనాధారంగా మారింది. దాంతోనే జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఆర్య సమాజ నేపథ్యం గల కుటుంబంలో జన్మించటం వల్ల సహజంగా అబ్బిన సంస్కారం వల్ల, సంస్కరణల దృష్టివల్ల, ఎన్ని సమస్యలొచ్చినా ఆమె తృప్తిగా జీవించారు.
సరళా థక్రాల్ లాంటి పాతతరం మహిళామణులు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. వారు జీవితంలో నేర్చుకున్న పాఠాలను అనుభవాల రూపంలో నేటి తరానికి అందజేస్తున్నారు. సంప్రదాయపు కట్టుబాట్లు బలంగా ఉన్న ఆ కాలంలోనే, మగవాళ్ళు సైతం నడిపేందుకు వెనుకాడే విమానాలను అవలీలగా నడిపిన ధీశాలి సరళా థక్రాల్ జీవితం నుండి నేటి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.