Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిలీనియర్ల "ఫోర్బ్స్" జాబితాలో నిషితా.!

Advertiesment
మహిళ స్పెషల్ ఉమన్ బిలీనియర్ ఫోర్బ్స్ జాబితా నిషితా షా స్థానం థాయ్‌లాండ్
, శుక్రవారం, 22 ఆగస్టు 2008 (15:20 IST)
FileFILE
రాబోయే తరం బిలీనియర్ల "ఫోర్బ్స్" జాబితాలో భారత సంతతికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల 'నిషితా షా' స్థానం సంపాదించుకున్నారు. థాయ్‌లాండ్‌లో జీపీ గ్రూప్ కంపెనీలకు సారథ్యం వహిస్తోన్న నిషితా... వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ... ఆ దేశంలో అత్యంత సంపన్నురాలిగా వెలుగొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన 1,125 మందిని గుర్తించిన "ఫోర్బ్స్"... వీరిలో 61 మంది వచ్చే తరంలో బిలీయనీర్లుగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో నిషితా స్థానం సంపాదించుకోగా... గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్, హాలీవుడ్ నటుడు టేలర్ పెర్రీ, జపాన్ పోర్టల్ మిక్సీ రూపకర్త కెంజీ కనహారా, బేబో సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థాపకుడు మైఖేల్... తదితరులు కూడా స్థానం సంపాదించారు.

నిషితా వ్యక్తిగత వివరాల్లోకి వస్తే.... ఈమె బోస్టన్ యూనివర్శిటీలో బిజినెస్ డిగ్రీ చదివి తండ్రి కోరిక మేరకు వ్యాపార పగ్గాలు చేపట్టారు. ఈమె చేస్తోన్న వ్యాపారం సంపద విలువ ఎంతో తెలిస్తే మనందరం ముక్కున వేలు వేసుకోక తప్పదు మరి. ఎంతంటే... 375 మిలియన్ డాలర్లు మాత్రమే...!

తండ్రి అప్పగించిన వ్యాపారాన్ని అతి తక్కువ కాలంలోనే మొదటి స్థానంలోకి తీసుకెళ్లారు నిషితా. 140 సంవత్సరాల కాలం నుండి ఆమె కుటుంబం వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ... గత మూడు సంవత్సరాలుగా ఆ సంస్థ రెట్టింపు లాభాలను నమోదు చేసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లటం వెనుక తన కృషి ఎంతగానో దాగి ఉంది.

కేవలం సంస్థను ముందుకు తీసుకెళ్లటం, భారీగా సంపాదించటం లాంటి వాటితో మాత్రమే నిషితా ఆగిపోకుండా... అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందే ఉన్నారు. 2004 సంవత్సరంలో సంభవించిన సునామీలో నష్టపోయిన బాధితుల కోసం ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిషితా మాతృమూర్తి కూడా, రొమ్ము కేన్సర్ బాధితులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu