అమెరికాకు చెందిన బిజినెస్ మేగజైన్ "ఫోర్బ్స్" ఇటీవల ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే...! అందులో ముగ్గురు భారతీయ మహిళలు స్థానం సంపాదించుకున్న సంగతీ విదితమే...!అయితే అదే ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసిన "ప్రపంచంలో అత్యంత సంపన్నులైన భవిష్యత్ వారసురాళ్లు" జాబితాలో కూడా ముగ్గురు భారతీయ యువ తరుణీమణులు మొదటి మూడూ స్థానాలు సంపాదించుకున్నారు. వీరిలో భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ప్రవాస భారతీయుడు, ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ నివాస్ మిట్టల్ కుమార్తె వనిషా మిట్టల్, భారత్‌కు చెందిన రియల్టీ సంస్థ డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కుమార్తె పాయ సింగ్‌లు ఉన్నారు.ఆస్తులు తరిగితే తారుమారే..! |
|
ఒకరకంగా ఊహించి తయారు చేసిన జాబితా అని, వారి తల్లిదండ్రుల ఆస్తులు తరిగినా లేదా వీలునామాలో వేరే వారికి వారి సొమ్మును దఖలు పరిచినా ఈ జాబితాల్లో స్థానాలు తారుమారై పోతాయని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఎస్టేట్ పన్నులు, దాతృత్వ కార్యక్రమాలు లాంటి... |
|
|
తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ... ఫోర్బ్స్ జాబితాలోకెక్కిన ఈ యువతుల్లో వనిషా మిట్టల్ మొదటి స్థానం సాధించగా... ఇషా అంబానీ రెండో స్థానం, పాయ సింగ్ మూడో స్థానం సంపాదించారు. భారతదేశంలోనే అత్యంత పిన్న వయస్సులో కోటీశ్వరురాలైన అమ్మాయిగా 16 ఏళ్ల ఇషా అంబానీ పై జాబితాకెక్కారు.
యుక్త వయస్సులో ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇషా పేరున ఉన్న వాటాల విలువ దాదాపుగా (344 కోట్ల రూపాయలు) 8 కోట్ల డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇకపోతే... రూ.4,42,900 కోట్ల విలువైన ఆర్సెలర్ మిట్టల్‌లో డైరక్టర్‌గా వ్యవహరిస్తోన్న వనిషా మిట్టల్ తన వివాహం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 473 కోట్ల రూపాయలతో జరిగిన ఆమె వివాహం అప్పట్లో ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.
ఇక పాయసింగ్ విషయానికి వస్తే... ఈమె డీఎల్‌ఎఫ్ గ్రూపులో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి ముఖ్య అధికారిణిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం మార్చి నాటికి కనీసం 640 కోట్ల బిలియన్ డాలర్లు (రూ.27,520 కోట్లు) నికర విలువ కలిగిన సంపన్న పారిశ్రామిక వేత్తల కుమార్తెల వివరాల ఆధారంగా ఫోర్బ్స్ పత్రిక పై జాబితాను రూపొందించింది.
ఇదిలా ఉంటే.... ఈ జాబితాను రూపొందించేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 మంది సంపన్నుల కుమార్తెల వివరాలను సేకరించినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఆ తరువాత 150 మందిలో చిన్న కుటుంబాలను, ఒకే వారసులు లేదా తక్కుమంది పిల్లలున్న వారిని తుది జాబితాకు ఎంపికచేశామని తెలిపింది.
ఇంకా... ఇది ఒకరకంగా ఊహించి తయారు చేసిన జాబితా అని, వారి తల్లిదండ్రుల ఆస్తులు తరిగినా లేదా వీలునామాలో వేరే వారికి వారి సొమ్మును దఖలు పరిచినా ఈ జాబితాల్లో స్థానాలు తారుమారైపోతాయని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఎస్టేట్ పన్నులు, దాతృత్వ కార్యక్రమాలు లాంటి వాటివల్ల చాలామంది సంపన్నులు తమ పిల్లల పేరిట యావదాస్తిని రాయకుండా... చాలా వరకు దాతృత్వ కార్యక్రమాలకు దానం చేస్తున్నారు. కాబట్టి అలాంటి కేసులను పరిగణనలోకి తీసుకోలేదని ఆ పత్రిక తెలిపింది.