Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రశాంతతలోని అందాన్ని ఆస్వాదిస్తున్నా...! : శిల్ప

Advertiesment
మహిళ ఉమెన్స్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు శిల్పాశెట్టి మెడిటేషన్ క్యాంప్ యోగా డీవీడీ మౌనం

Ganesh

, గురువారం, 7 ఆగస్టు 2008 (19:36 IST)
FileFILE
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఇటీవల "వన్‌నెస్ మెడిటేషన్ క్యాంప్"కు హాజరైన శిల్పాశెట్టి ఒక వారం రోజులపాటు అక్కడే గడిపారు. కనీసం పది నిమిషాలపాటు కూడా నువ్వు మౌనంగా ఉండలేవంటూ తన స్నేహితులు, సన్నిహితులు ఆటపట్టించే వారని గతంలో చెప్పిన శిల్ప... ఈ క్యాంప్‌లో మాత్రం పూర్తిగా "మౌనవ్రతం"లోనే గడిపారని చెప్పవచ్చు.

ఎప్పుడూ గలగలా ఉండే మీరు ఇంత మౌనంగా ఉండటం ఎలా సాధ్యమయ్యిందంటూ మీడియా వాళ్ళు అడిగితే... "ఈ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రశాంతతలోని అందాన్ని ఆస్వాదిస్తున్నాను" అని చెప్పింది శిల్పాశెట్టి.
ఇవేమీ కొత్తకాదుగా..!
  ఆ మధ్య రిచర్డ్ గెరె‌తో ముద్దు తెచ్చిన చిక్కులు, ఓ పెళ్లైన వ్యక్తితో సంబంధం అంటూ వచ్చిన వదంతులుగానీ శిల్ప విజయాలను ఏ మాత్రం ఆపలేక పోయాయి. వివాదాలు, విజయాలు ఆమెకు కొత్తకాదు కాబట్టే... సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా విజయవంతంగా...      


అన్నట్టు... శిల్పాశెట్టి అనగానే మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. "బిగ్‌బ్రదర్ టీవీ షో"లో జాతి వివక్షను ఎదుర్కొని అనితరసాధ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నది ఈమే మరి...! ఈ షోలో దాదాపుగా 63 శాతానికి పైగా ఓట్లను సంపాదించిన ఈ సంచలన తార కన్నీళ్లు పెట్టిన చోటనే విజయదరహాసం చిందించారు.

1975వ సంవత్సరం జూన్ 8వ తేదీన తమిళనాడులో జన్మించిన శిల్పాశెట్టి... "బాజీగర్" అనే చిత్రంతో హిందీ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత దాదాపు 50కి పైగా హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాలలో నటించారు. తనకున్న పరిధిలోనే వైవిధ్యభరితమైన పాత్రల కోసం పరితపించే నటిగా ఈమె పేరు సంపాదించారు.

బిగ్‌బ్రదర్ రియాలిటీ షోలో ఒక భారతీయ మహిళ మనోబలాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేసిన శిల్పకు సహజంగానే భారతీయులంతా బ్రహ్మరథం పట్టారు. ఇక బాలీవుడ్ అయితే చెప్పాల్సిన పనే లేదు... ఎర్ర కార్పెట్ పరచి మరీ ఆహ్వానించింది. ఆ రకంగా ఆమెకు ఎన్నో సినిమా ఛాన్సులు వచ్చాయి.

ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, కెరీర్‌ను ఒక దారిలోకి తెచ్చుకున్న 34 సంవత్సరాల శిల్ప... ఆ తరువాత, యోగాపై దృష్టిని సారించారు. వయసు మీరుతున్నకొద్దీ, ఎప్పట్లాగే అందంగా ఉండాలంటే యోగాను మించిన సాధనం మరొకటి లేదనే సంగతిని ఈమె గ్రహించారు. బాగా పేరున్న యోగ గురువులందరివద్దా కఠోరమైన సాధన చేశారు. అందులో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారు.

ఇంకేముంది, తాను మాత్రమే నేర్చుకున్న ఆరోగ్య సూత్రాలను, సాధనాలను తనకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రపంచ వ్యాప్తంగా పదిమందికి పంచాలని నిర్ణయించుకుంది శిల్ప. అందులో భాగంగా వెలుగులోకి వచ్చిందే "శిల్పాస్ యోగాస్" అనే డీవీడీ. ఇది దేశ విదేశాల్లోనూ మంచి పేరు సంపాదించుకుంది.

కొద్దికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫిట్‌నెస్ ట్రయినర్ల డీవీడీలను మించిపోయింది శిల్పాస్ యోగా డీవీడీ. తానే స్వంతంగా స్థాపించిన "ఎస్2 గ్లోబల్ ప్రొడక్షన్స్" సంస్థ కేవలం ఈ డీవీడీతో మాత్రమే ఆగిపోకుండా మరిన్ని కార్యక్రమాలను చేపట్టే పనిలో ప్రస్తుతం బిజీగా ఉంది శిల్ప.

ఆ మధ్య రిచర్డ్ గెరె‌తో ముద్దు తెచ్చిన చిక్కులు, ఓ పెళ్లైన వ్యక్తితో సంబంధం అంటూ వచ్చిన వదంతులుగానీ శిల్ప విజయాలను ఏ మాత్రం ఆపలేక పోయాయి. వివాదాలు, విజయాలు ఆమెకు కొత్తకాదు కాబట్టే... సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారామె...!

Share this Story:

Follow Webdunia telugu