Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ చరిత్రలో తొలి మహిళా సెయింట్

Webdunia
శుక్రవారం, 3 అక్టోబరు 2008 (19:11 IST)
రెండు వేల సంవత్సరాల భారత దేశ క్రైస్తవ మత చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఓ మహిళకు వాటికన్ సెయింట్‌హుడ్‌ ప్రకటించనుంది. కేరళకు చెందిన అల్ఫోన్సా అనే క్రైస్తవ సన్యాసినిని అక్టోబర్ 12న వాటికన్‌లో జిరిగే ఓ కార్యక్రమంలో పోప్ బెనెడిక్ట్ పునీతురాలుగా గుర్తించి ఆమెకు సెయింట్‌హుడ్ ఇవ్వనున్నారు.

దేశ చరిత్రలో తొలి మహిళా సెయింట్‌గా నిలిచిపోనున్న అల్ఫోన్సా తన జీవితంలో ఎక్కువ భాగాన్ని కొట్టాయం జిల్లా భరనంగనంలోని క్లారిస్ట్ కాన్వెంట్‌లో గడిపారు. సిస్టర్ అల్పోన్సా కొట్టాయం జిల్లా కుడుమలూరులో 1910 ఆగస్టు 19న జన్మించారు. బాల్యంలోనే తల్లిని కో్ల్పోయిన ఈమె పలు రకాల వ్యాధులతో బాధపడేది. అయితే క్రైస్తవ మతం పట్ల ఆమె కడు నిష్టతో ఉండేవారు.

1927 లో క్లారిస్ట్ కాన్వెంట్‌లో చేరిన ఆల్పోన్సా 1946లో కన్నుమూశారు. ఆమె మరణించిన తర్వాత 1953లో ఆమె కేననైజేషన్ ప్రారంభమైంది. 1985లో పోప్ జాన్‌పాల్ 2 భారత దేశాన్ని సందర్శించిన సందర్భంగా ఆమెకు బీటిఫికేషన్ ఇచ్చారు. తన జీవితంలో మహిమలు ప్రదర్శించి చూపిన వారికే క్రైస్తవ మతంలో సెయింట్‌హుడ్ ఇస్తుంటారు.

సిస్టర్ ఆల్పోన్సాకు ఆపాదించబడిన అద్భుతానికి వాటికన్ ఆమోదముద్ర వేసి సెయింట్‌హడ్‌కు మార్గం సుగమం చేసింది. సెయింట్. భారతదేశంలో జన్మించకున్నప్పటికీ భారత్‌లోనే జీవితాంతమూ సేవా కార్యక్రమాలు నిర్వహించిన మదర్ థెరెస్సాకు కూడా గతంలో వాటికన్ చర్చి సెయింట్‌హుడ్ ఇచ్చి సత్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారతీయ మూలాలున్న క్రైస్తవ సన్యాసినికి వాటికన్ అపూర్వ గౌరవం ఇవ్వడం భారతీయ క్రైస్తవ మతానుయాయులకు గర్వకారణం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments