ప్రతిరోజూ తాను దేవతలతో మాట్లాడుతున్నానని ఎవరైనా అంటే మనం వెంటనే అనుమానపడతాం. అయితే బ్రిటన్‌కు చెందిన లోర్నా బైర్న్ కథకు కాస్త ప్రత్యేకత ఉంది మరి. ఏంజెల్స్ ఇన్ మై హెయిర్ అనే తన స్వీయ చరిత్రలో తాను చిన్నప్పటినుంచీ దేవతలతో మాట్లాడుతున్నానని ఈమె పేర్కొంది. తాను బాల్యం నుంచి దేవతలను, అతీత శక్తులను చూస్తున్నానని, అవి తనతో ఎప్పుడూ స్నేహం చేస్తుంటాయని లోర్నా పేర్కొనడం పెద్ద విశేషంగా మారింది. ది డావిన్సీ కోడ్ గ్రంధ ప్రచురణ కర్తలు బైర్న్ జీవితచరిత్రను ప్రచురించారు. |
దేవతలు మానుష రూపంలోనే ఉంటారు. లేకుంటే అర్థ మానుష రూపంలో ఉంటారు. మనిషి ఊహా ప్రపంచంలోంచే కదా దేవతలూ దెయ్యాలు చరిత్ర క్రమంలో పుట్టుకొచ్చారు! జంతువులకు కూడా దేవతల వంటివి ఉంటే అవి ఖచ్చితంగా జంతు రూపంలోనే ఉంటాయని ఓ తత్వవేత్త చెప్పారు కదా... |
|
|
దేవతలతో తాను చెలిమి చేస్తున్నానని అంటున్నానంటే ప్రతిరోజూ వారి రెక్కలను కూడా చూస్తుంటానని అర్థం కాదని లోర్నా చెబుతోంది. -పశ్చిమదేశాల్లో దేవకన్యలు ఆకాశంలో ఎగురుతూ వస్తూంటారు- అయితే ఒకటి మాత్రం తాను ఢంకా భజాయించి చెప్పగలనని, దేవతలు వర్ణించలేనంతటి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంటారని ఆమె విస్ఫారిత నేత్రాలతో వర్ణిస్తుంది.
ఒకరోజు తాను మరో వ్యక్తితో కలిసి రూములోకి వెళ్లానని, అక్కడ తన సంరక్షకురాలైన దేవత సాక్షాత్కరించిందని, ఆమె బంగారు రెక్కలతో కనిపించిందని లోర్నా చెబుతుంది. ప్రజల వెనుకభాగంలో కాంతి వలయాలను తాను చూస్తుంటానని, ఆ కాంతివలయాలు ప్రజలను కాపాడే దేవతలేనని ఆమె చెబుతుంది.
మనందరమూ ఆలాంటి కాంతి వలయాన్ని కలిగి ఉంటామని అంటుంది లోర్నా. ప్రజలను కాపాడే ఈ దేవతలు మన వెనుకభాగంలో మూడు ముఖాలతో ఉంటారని చెబుతుందామె. అయితే వీరినే కాకుండా తాను మరొక రకం దేవతలను కూడా చూస్తుంటానని లోర్నా అంటుంది. వారిని తాను సహాయకులు మరియు బోధకులు అని పిలుస్తుంటానని చెబుతుంది. వీళ్లు తెల్లగాను, సుందరంగాను ఉంటారని చెబుతుంది.
అయితే తనకు కనిపించే దేవతలందరూ మానవ రూపంలోనే ఉంటున్నారని లోర్నా చెబుతుంది. మానుష రూపంలో ఉంటారు కాబట్టే వారిని చూస్తే మనం భీతిల్లిపోమని లోర్నా నమ్మబలుకుతుంది.
ఒకటి మాత్రం నిజం.. లోర్నా చెప్పింది నిజమే.. దేవతలు సాధారణంగా మానుష రూపంలోనే ఉంటారు. లేకుంటే అర్థ మానుష రూపంలో ఉంటారు. ఎందుకంటే మనిషి ఊహా ప్రపంచంలోంచే కదా దేవతలూ దెయ్యాలు చరిత్ర క్రమంలో పుట్టుకొచ్చారు! బహుశా జంతువులకు కూడా దేవతలు అంటూ ఉంటే అవి ఖచ్చితంగా జంతు రూపంలోనే ఉంటాయని వెనుకటికి ఒక తత్వవేత్త చెప్పారు కదా..
ఎవరి ఊహా ప్రపంచం వారిదే మరి...