Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యమాలే ఊపిరిగా...!

Advertiesment
మహిళ ఉమెన్స్ స్పెషల్ లక్ష్మీ సెహగల్ రాష్ట్రపతి కెప్టెన్ మహిళ ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ ఐద్వా
, గురువారం, 21 ఆగస్టు 2008 (13:06 IST)
FileFILE
కెప్టెన్ లక్ష్మీ సెహగల్‌గా సుపరిచితురాలైన ఈమె జీవితమంతా ఉద్యమాలతోనే గడిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటికీ ఈమె విసుగూ విరామం లేకుండా పేద, దిగువ మధ్యతరగతి మహిళలకు వైద్యసేవలందిస్తోన్న... తొంభై నాలుగేళ్ల సెహగల్ భారత రాష్ట్రపతి పదవికి పోటీచేసిన తొలి మహిళగా గుర్తింపుపొందారు.

"ఇండియన్ నేషనల్ ఆర్మీ"లో కెప్టెన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, "ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియయేషన్ (ఐద్వా)" ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో పలు భాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ సెహగల్ పూర్తిగా సామాజిక సేవకు అంకితమయ్యారు.
కుమార్తె కూడా తల్లిబాటలోనే..!
  1947వ సంవత్సరంలో లాహోర్‌కు చెందిన కల్నల్ ప్రేమ్‌కుమార్ సెహగల్‌ను వివాహం చేసుకుని, కాన్పూర్‌లో స్థిరపడ్డారు. వీరికి ఏకైక సంతానం సుభాషిణీ అలీ. ఈమె కూడా తల్లి నుండి స్ఫూర్తి పొంది వివిధ సామాజిక ఉద్యమాలలో పాలుపంచు కుంటున్నారు...      


చెన్నైలో సుప్రసిద్ధ న్యాయవాది స్వామినాథన్, సామాజిక సేవా కార్యకర్త ఎ.వి. అమ్ముకుట్టిల ముద్దుల పట్టీ అయిన సెహగల్ చిన్నతనంలోనే విదేశీ వస్తు బహిష్కరణ, మద్య నిషేధం లాంటి జాతీయ పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకుని సెహగల్ సింగపూరు వెళ్లారు.

సింగపూర్‌లో హాస్పిటల్ ఒక దానిని నిర్మించి, అక్కడ స్థానికంగా ఉండే భారతీయ కార్మికులకు సెహగల్ వైద్య సేవలు అందించేవారు. ఆ కాలంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగానికి ఆకర్షితురాలైన ఈమె... స్వాతంత్రోద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు.

అంతేగాకుండా... నేతాజీ స్థాపించిన "ఇండియన్ నేషనల్ ఆర్మీ" ఆధ్వర్యంలోని "ఝాన్సీ" రెజిమెంటుకు సెహగల్ సారధ్యం వహించారు. అప్పటి నుంచే సెహగల్ కెప్టెన్ సెహగల్‌గా మారిపోయారు. భారతావని స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత స్వతంత్ర దేశంలో ఆమె రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

ఆ తరువాత "ఐద్వా" ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన సెహగల్ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రత్యేక ప్రచార ఉద్యమం చేపట్టారు. బంధనాలను తెంచుకుని స్వతంత్ర దేశంలో సగభాగమైన మహిళలు స్వయం స్వావలంబన సాధిస్తేనే దేశం అభివృద్ధిని సాధిస్తుందని ఆమె బలంగా నమ్మేవారు.

ఇందులో భాగంగా 2002 సంవత్సరంలో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సెహగల్ వామపక్ష అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎంపికైన సంగతి మనకందరికీ తెలిసిందే...!

సెహగల్ కుటుంబ జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వస్తే... 1947వ సంవత్సరంలో లాహోర్‌కు చెందిన కల్నల్ ప్రేమ్‌కుమార్ సెహగల్‌ను వివాహం చేసుకుని, కాన్పూర్‌లో స్థిరపడ్డారు. వీరికి ఏకైక సంతానం సుభాషిణీ అలీ. ఈమె కూడా తల్లి నుండి స్ఫూర్తి పొంది వివిధ సామాజిక ఉద్యమాలలో పాలుపంచుకుంటున్నారు.

దక్షిణ భారతదేశంలో పుట్టి, విదేశాలను చుట్టివచ్చి... తిరిగీ స్వదేశంలో అడుగుపెట్టిన లక్ష్మీ సెహగల్, స్వతంత్ర భారతావని ఉత్తర భారతంలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. ఎక్కడ ఉన్నా సరే, ప్రతి క్షణాన్నీ ఈమె మహిళల కోసమే కేటాయిస్తూ, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. సెహగల్ చేసిన సేవలకు గుర్తింపుగా 1998వ సంవత్సరంలో భారత ప్రభుత్వం "పద్మవిభూషణ్" అవార్డుతో సత్కరించింది.

Share this Story:

Follow Webdunia telugu