Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతులను కలవరపెట్టే అవాంచిత రోమాలు!

యువతులను కలవరపెట్టే అవాంచిత రోమాలు!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:18 IST)
కొంతమంది యువతుల సౌందర్యానికి అపశృతుల్లా అందమైన శరీరంపై వెంట్రుకలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. దీంతో చాలామంది సిగ్గుతో నలిగిపోతూ, బాధపడుతుంటారు. పదిమందిలోకి ఆ వెంట్రుకలతో రావాలంటే కుంచించుకుపోతుంటారు. 
 
సాధారణంగా చాలామంది స్త్రీలకు వెంట్రుకలుంటాయి. కొంతమందికి పల్చగా కనపడితే, మరికొంత మందికి కనిపించకుండా ఉంటాయి. మరికొందరికి దట్టమైన కేశ సంపద ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉన్నట్లయితే వారి శరీరం మగవారి శరీరంలా ఉంటుంది. ఇలాంటివారు ఎంత అందంగా ఉన్నా కూడా ఈ లోటు అందాన్ని తగ్గించేస్తుంది. దీనికి పరిష్కారం వెంట్రుకలను తొలగించడమే. ఎలక్ట్రాలసిస్, త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ పద్ధతుల ద్వారా వెంట్రుకలను తొలగించుకోవచ్చు. 
 
ఎలక్ట్రాలసిస్ : ఎలక్ట్రాలసిస్ అనేది పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో బ్యుటీషియన్లు చేస్తుంటారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే డబ్బుతో కూడుకున్న పని. ఇంతగా కష్టపడి చేసుకున్నా మళ్ళీ వెంట్రులు వచ్చేస్తాయి. కనుక ఇది తాత్కాలికమైన ప్రక్రియే. 
 
త్రెడ్డింగ్ : త్రెడ్డింగ్ అనేది చాలా తేలికైన పని. దీనిని ఎవరికివారే స్వయంగా చేసుకోవచ్చు. దీంతో కనుబొమలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. త్రెడ్డింగ్ చేయించుకుంటే వెంట్రుకలు వేగంగా పెరుగుతాయనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే అటువంటిదేం జరగదని బ్యుటీషియన్లు చెపుతున్నారు. 
 
వ్యాక్సింగ్ : పైన పేర్కొన్న అన్ని విధానాల్లోకెల్లా ఈ పద్ధతి ప్రాచుర్యం పొందింది. ఈ పద్ధతితో వెంట్రుకలను తొలగించేటప్పుడు దీని వలన శరీరానికి కొంచెం నొప్పి వున్నా ఎలాంటి నష్టం కలిగించదు. నిత్యం ఈ పద్ధతిని పాటించటం వల్ల వెంట్రుకల పెరుగుదల చాలా వరకు అరికట్టవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. 

Share this Story:

Follow Webdunia telugu