Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధూమపానంలో పురుషులతో పోటీ పడుతున్ స్త్రీలు!

ధూమపానంలో పురుషులతో పోటీ పడుతున్ స్త్రీలు!
, సోమవారం, 11 ఆగస్టు 2014 (14:59 IST)
"పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్...!" అనే ధూమపాన ప్రియుల మాటల్ని నేడు మన భారతదేశ మహిళామణులు బాగానే వంటబట్టించుకున్నట్లు తెలుస్తోంది. పొగ సేవించే ప్రపంచంలోని టాప్-20 దేశాల జాబితాలో మన మహిళా మణులు ముచ్చటగా మూడో స్థానాన్ని అలంకరించటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు.  
 
ఇక అన్నింట్లోనూ అగ్రరాజ్యంగా కొనసాగుతోన్న ప్రపంచ పెద్దన్న అమెరికా ఈ విభాగంలో సైతం తన "అగ్ర" హోదాను నిలబెట్టేసుకుంది. ఈ దేశంలో 2.3 కోట్లమంది మహిళలు ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లను ఊది పారేస్తున్నారట. అలాగే జనాభాలో ముందువరుసలో ఉన్న చైనా 1.3 కోట్ల మంది మహిళా ధూమపాన ప్రియులతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత స్థానం మాత్రం మనదే..!
 
మన దేశంలో మహిళా ధూమపాన ప్రియుల సంఖ్య 20 శాతం లోపే ఉన్నప్పటికీ... ఇది ఆందోళనకర పరిణామమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ మనతో పోటీపడే దాయాది దేశం పాకిస్థాన్ మహిళా ధూమపాన సేవికుల టాప్-20 లిస్టులో చివరి స్థానంలో నిలవటం గమనార్హం. పాక్‌లో పొగతాడే పడతుల సంఖ్య కేవలం 30 లక్షలు మాత్రమేనట.!
 
భారత్‌లో ధూమపానం సేవించే పడతులు, ఈ అలవాటు లేని మహిళలకంటే ఓ ఎనిమిది సంవత్సరాలు ముందుగానే మృత్యువు పాలవుతున్నట్లు పై నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ మంది మహిళలు ప్రతిరోజూ పొగ తాగుతుండగా.. అభివృద్ధి చెందిన దేశాలలో 22 శాతం, ఇతర దేశాలలో 9 శాతం మంది పొగతాగుతూ... వారి జీవితాలను మసిబార్చుకుంటున్నట్లు ఈ నివేదిక బట్టబయలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu