Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊయల ఊగడం కూడా ఓ వ్యాయామమేనట!!

ఊయల ఊగడం కూడా ఓ వ్యాయామమేనట!!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:57 IST)
ఊయల ఊగడం కూడా ఓ వ్యాయామమేనని వ్యాయామ నిపుణులు చెపుతున్నారు. ఊయల ఊగడం వల్ల బరువు తగ్గుతారని చెపుతున్నారు. "ఏంటీ... ఊయల ఊగితేనే బరువు ఎలా తగ్గిపోతారానే కదా మీ సందేహం...!" ఊయల్లో ఊగితే నిజంగానే బరువు తగ్గిపోతారు. ఉయ్యాల ఊగడం పిల్లలకు, పెద్దలకు ముఖ్యంగా మహిళలకు కూడా ఒక మంచి వ్యాయామం కాగలదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఉయ్యాల పసిపిల్లల ఆటగానే ఇన్నాళ్లూ భావిస్తున్నప్పటికీ, ఇది పెద్దలకు కూడా ఒక మంచి వ్యాయామమని నిపుణులు అంటున్నారు.
 
ఊబకాయంతో బాధపడే మహిళలు అరగంటసేపు ఉయ్యాలలో ఊగుతూ, వంగుతూ శరీరానికి వ్యాయామం కలిగిస్తే... కొన్ని వారాలకే ఆరోగ్యకరంగా, ఉత్సాహంగా, తేలికగా తయారవుతారని వారు చెపుతున్నారు. అయితే, ఉయ్యాల ఊగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.... 
 
ఉయ్యాల బల్లపై కూర్చుని ఒక కాలు ముందుకు, మరో కాలు వెనక్కి పెట్టి ఊగాలి. అలాగే.. పొట్ట భాగాన్ని లోపలికి పోనిచ్చి, తాడుకు మోచేతులను ఆన్చాలి. అలాగే తాడు పట్టుకుని కొద్దిగా వెనక్కి వెళ్ళి మోచేతులతో ఒత్తిడిని ప్రయోగించి తాడు సహాయతో ముందుకు ఊగాలి. శరీరాన్ని సరైన భంగిమలో ఉంచి ఇలా 10 నిమిషాలపాటు క్రమపద్ధతిలో ఊగితే 42 కేలరీల వరకు బరువు తగ్గొచ్చని చెపుతున్నారు. 
 
ఇకపోతే... శరీర బరువునంతటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేగంగా ఊగడం వల్ల నడుం కింది భాగం గట్టిపడుతుంది. ఇలా చేసేటప్పుడు వీపుని నొక్కి పట్టుకుని కొద్దిగా.. వెనక్కి వెళ్ళి ఆ తర్వాత ముందుకు గట్టిగా ఊగాలి. వేగంగా ఊగుతూ బాగా పైకి వెళ్లడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండటమే కాదు దీనివల్ల శరీర కండరాలన్నింటిపైనా ఒత్తిడి బాగా పడుతుంది. ఇలా 10 నిమిషాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని చెపుతున్నారు. 
 
ఉయ్యాలను ముంజేతులతో తోస్తూ ఊగితే పుషప్స్ చేస్తే వచ్చే ప్రయోజనాలు కలుగుతాయి. ఊగుతూ బాగా ఎత్తు వరకూ వెళ్లడం వల్ల చేతులు, భుజాలు, వెన్ను, కాళ్ల భాగాలకు ఒకే సమయంలో మంచి వ్యాయామం అవుతుంది. ఊగేటప్పుడు వంగడం, లేవడం వల్ల క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలా 10 నిమిషాల పాటు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
 
మహిళలకు ఈ ఉయ్యాల వ్యాయామం చాలా మంచిది. దీనివల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. చేతుల లావుతగ్గి చక్కటి ఆకృతిని పొందుతారు. భుజాలు దృఢంగా తయారవుతాయి. ఛాతి పటిష్టంగా తయారవుతుంది. పిరుదులు, తొడలు దృఢంగా మారుతాయి. శరీరం కూడా తేలికగా, ఉత్సాహంగా తయారవుతుందని వ్యాయామ నిపుణులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu