Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రుల్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా?

రాత్రుల్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా?
, సోమవారం, 14 జులై 2014 (15:22 IST)
మహిళలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు, దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి. తమ వద్ద చిన్నపాటి ఆయుధాలను ఉంచుకోవాలి. మిరప్పొడి, చిన్న కత్తి వంటి వస్తువులను ఉంచుకోవడం ద్వారా తమను తాము కాపాడుకోవడానికి ఉపయోగపడుతాయని నిపుణులు అంటున్నారు. 
 
కానీ రాత్రై, పగలైనా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనని వారు సూచిస్తున్నారు. అవేంటంటే.. తమపై దాడికి ప్రయత్నించిన లేదా అత్యాచారానికి పాల్పడిన వారి నుంచి తమను తాము కాపాడుకోవచ్చుననే నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరుచుకోవాలి. తమను తాము కాపాడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించాలి. పోలీస్ స్టేషన్లు, ఎమెర్జెన్సీ నెంబర్లను తెలుసుకోవాలి. 
 
రైళ్ళల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు.. మనుషులే లేని కంపార్ట్‌మెంట్లను ఎంచుకోకూడదు. తక్కువ రద్దీ వున్న కంపార్ట్‌మెంట్లలోనూ ఎక్కకూడదు. రద్దీగా ఉండే కంపార్ట్‌మెంట్లను ఎక్కడం అలవాటు చేసుకోండి. ఒకవేళ ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే.. తల్లిదండ్రులకు తానో ఆటోలో ఉన్న విషయాన్ని.. ఆటో నెంబర్‌ని తెలియజేయండి. ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలియజేయండి. 
 
బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ నిలిచినా ఫ్యామిలీ లేదా మహిళలతో రద్దీగా ఉన్న ప్రాంతంలోనే నిలబడండి. రాత్రుల్లో వీధుల్లో నడవాల్సి వస్తే భయపడుకుంటూ.. తలదించుకుని నడవకండి. నాలుగువైపులా చూడండి. హేళన చేసే మగాళ్లను ఏమాత్రం పట్టించుకోకండి.

Share this Story:

Follow Webdunia telugu