Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధూమపానంలో భారత్‌కు ద్వితీయ స్థానం : 1.27 కోట్ల మంది మహిళలు!

ధూమపానంలో భారత్‌కు ద్వితీయ స్థానం : 1.27 కోట్ల మంది మహిళలు!
, మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:52 IST)
భారత్‌లో ధూమపానం చేసే మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఏకంగా 1.27 కోట్ల మంది పొగతాగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ  నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. వాస్తవానికి జనాభా లెక్కల్లో కమ్యూనిస్టు దేశం చైనాను వెనక్కి నెట్టిన భారతీయ మహిళలు.. ధూమపానంలో అగ్రదేశాలతో సైతం పోటీ పడుతున్నారు. పొగతాగడంలో అమెరికాను మించిపోయి ద్వితీయ స్థానంలో నిలిచారు. గత మూడు దశాబ్దాల్లో మన దేశంలోని మహిళలల్లో ధూమపానం రెండింతలు పెరిగిందని ఓ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. 
 
ప్రస్తుతానికి 1.27 కోట్ల మంది మహిళలు ధూమపానం చేస్తున్నారని తెలిపింది. ధూమపాన నివారణ చర్యలతో ఫ్రాన్స్, రష్యా దేశాలు మహిళల్లో ఆ అలవాటును మాన్పించగలిగాయని ఆ సంస్థ వివరించింది. ధూమపానం కారణంగా ప్రతి ఏటా సుమారు 10 లక్షల మంది మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
మరోవైపు.. ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తున్నా.... ధూమపానం ఆగడం లేదు సరికదా, రోజురోజుకీ పెరిగిపోతోంది. దీని తీవ్రత గమనించిన కేంద్రం సిగరెట్, బీడీ పెట్టెలపై పుర్రెబొమ్మ ముద్రించడం వంటి హెచ్చరికలు అమలయ్యేలా నిబంధనలు తెచ్చింది. దానితో ఊరుకోకుండా అమాంతం ధరలు పెంచేసి, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం శిక్షార్హమని కూడా ప్రకటించింది. అయినప్పటికీ, ధూమపానంలో భారతీయ మహిళలు అగ్రదేశాలతో పోటీ పడుతుండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu