Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణీ స్త్రీలకు లవంగాలు ఎంతో లాభదాయకం

గర్భిణీ స్త్రీలకు లవంగాలు ఎంతో లాభదాయకం
, సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (09:40 IST)
మనం తరచూ వంటలకు ఉపయోగించే లవంగాలలో వైద్యగుణం వున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ లవంగాలు గర్భిణీ స్త్రీలకు వారియొక్క గర్భాశయాన్ని బలోపేతం చేయడమే కాకుండా గుండె, కిడ్నీలు, ఊపిరి తిత్తులకు కూడా మంచి బలవర్ధకమైనదిగా వైద్యులు పేర్కొన్నారు.
 
లవంగాల పొడిని ఆవుపాలలో వేసి ప్రతిరోజు సగంపాలు మరిగేంత వరకూ కాచుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగితే, రక్తంతో సహా శరీర ధాతువులన్నీ పుష్టిగా తయారవుతాయని నిపుణులు అంటున్నారు.
 
గర్భస్త దశలోనున్న స్త్రీలకు తరచూ వాంతులు, అజీర్తీ , కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, వికారం కలిగినట్లు వుంటుంది అలాంటప్పుడు లవంగాలను తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
గర్భవతులుగావున్నప్పుడు శరీరానికి నీరు పట్టి, ముఖం బాగా ఉబ్బినట్టు వుంటుంది. అప్పుడు లవంగాల కషాయం తీసుకుంటే ఆ వాపు పూర్తిగా తగ్గుతుంది.
 
గర్భావస్థలోనున్నప్పుడు స్త్రీలకు పదేపదే మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. దీనిని నివారించడానికి లవంగాల కషాయం తీసుకుంటే అతిగా మూత్రం అవడం నెమ్మదిస్తుందని వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu