Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల్లో వెన్నునొప్పి... బ్రా సైజుల్లో తేడాలే కారణం...

మహిళల్లో వెన్నునొప్పి... బ్రా సైజుల్లో తేడాలే కారణం...
, శనివారం, 21 నవంబరు 2015 (15:55 IST)
మహిళల్లో చాలామంది వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఐతే మహిళలు తమ వక్షోజాల పరిమాణానికి అనుగుణంగా ఉండే బ్రా ధరిస్తే వెన్నునొప్పి నివారణ కోసం భారీ మొత్తంలో వైద్య ఖర్చులు పెట్టే అవసరం లేదని తాజా పరిశోధనలు వెల్లడించాయి. పెద్ద సైజులో ఉండే వక్షోజాల వల్ల మహిళల మెడ, వీపు, భుజాలలో నొప్పి కలిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
మహిళలు ధరిస్తున్న బ్రా సైజులను తనిఖీ చేసి అవి వారి శరీర కొలతలకు తగిన విధంగా ఉన్నాయో లేదో సూచిస్తున్న లండన్ హాస్పిటల్ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఏమంటే ఈ ఆస్పత్రి తనిఖీ చేసిన మహిళలలో ఏ ఒక్కరూ తమ శరీర కొలతకు తగిన బ్రాలను ధరించలేదట. 
 
వక్షోజాల కొలతకు తగిన బ్రాను ధరించగలిగితే బ్రెస్ట్ ఆపరేషన్లకు గాను వేలాది పౌండ్లు వెచ్చించాల్సిన పనిలేదని లండన్‌లోని రాయల్ ఫ్రీ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ అలెక్స్ క్లార్క్ చెప్పారు. మహిళలు వైద్యం కోసం క్లినిక్‌కి వెళ్లినప్పుడు వారి బ్రా సైజు గురించి ఖచ్చితంగా చెప్పగలిగే బ్రా సైజ్ నిపుణుల సహాయం ఈ ఆస్పత్రిలో లభ్యమవుతుందని అలెక్స్ చెప్పారు. 
 
నేటివరకూ ఈ ఆస్పత్రికి వచ్చిన మహిళల్లో నూటికి నూరు శాతంమంది తప్పు సైజు బ్రాను ధరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో వక్షోజాల బరువును మాత్రమే మోయాల్సిన బ్రాలు భుజాల బరువును మోయవలసి రావడం వల్ల వెన్ను నొప్పి కలుగుతోందని అలెక్స్ చెప్పారు. 
 
మహిళలు తమ వెన్ను సైజును నాలుగు అంగుళాల మేరకు తగ్గించి అంచనా వేస్తున్నారని, అదే సమయంలో తమ బ్రా కప్ సైజును మూడు సైజుల వరకు మించి అంచనా వేస్తున్నారని లండన్‌లోని సెయింట్ జార్జ్ ఆస్పత్రికి చెందిన బ్రెస్ట్ సర్జన్ ప్రొఫెసర్ కేఫా మోక్‌బెల్ తెలిపారు. 
 
మహిళల మెడ, వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యలు ప్రధానంగా కొలతకు అనుగుణంగా లేని బ్రాలతోటే వస్తున్నాయని చెప్పారు. అందుకనే మహిళలు తమ వక్షోజాల కొలతలకు అనువైన బ్రాలను మాత్రమే ధరిస్తే ఖర్చుతో కూడిన శస్త్రచికిత్స చేయించుకోవలసిన అవసరం వారికి లేదని మోక్‌బెల్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu