Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లావు తగ్గడానికి ఆహారం తగ్గించడం మార్గం కాదు.

లావు తగ్గడానికి ఆహారం తగ్గించడం మార్గం కాదు.
, గురువారం, 9 ఆగస్టు 2007 (18:11 IST)
లావు తగ్గడానికి సాధారణంగా అందరూ ఆహారం మానేస్తుంటారు. వాస్తవానికి ఈ పద్ధతి మంచిదికాదు. తిండి సరిగా లేకపోతే ఆ ప్రభావం వలన వివిధ శరీర భాగాల్లో కొవ్వు పెరగడానికి ఆస్కారం ఉంది. దాని వలన శరీరాకృతి పెరగటానికి కూడా అవకాశాలున్నాయి. మోడలింగ్ చేసే వారికి ఫిట్‌నెస్‌ని పెంచుకోవడం చాలా అవసరం. శరీరాకృతిని చక్కగా పెంచుకోడానికి తీసుకునే నియమాల్లో కొన్ని మీ కోసం... ఆహారం తీసుకునే విధానంలో శ్రద్ధ అవసరం.

ఈ పద్ధతిపై డైటీషియన్ల సలహాలు తీసుకోవడం మంచిది. విశ్రాంతి తీసుకోవడంలో కూడా శ్రద్ధ వహించాలి. విశ్రాంతి లేకపోతే మొహంలో ప్రకాశవంతం ఉండదు. అందుకే రోజుకి ఎనిమిది గంటల సేపు తప్పక నిద్రపోవాలి. మోడలింగ్‌ చేయాలని ఆసక్తి పడే అమ్మాయిలూ ఈ పద్ధతులు తప్పక పాటించాలని డైటీషియన్ నిపుణులు పేర్కొంటున్నారు. వర్కింగ్ ఉమెన్స్, హౌస్ వైఫ్స్‌ కూడా ఈ పద్ధతులు పాటించడం మంచిది. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి.

దీనివలన మెదడు రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఆలోచనల్లో ఎలాంటి అలజడి లేకపోతే నిలకడగా, నిబ్బరంగా ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించగలరు. ప్రతిరోజూ ఓ గంటపాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే గంటలపాటు నడవాల్సిన పనిలేదు. స్వేదం వచ్చేలా గంటపాటు నడిస్తే చాలు.

ఇలాంటి క్రియల వలన శరీరంలోని అదనపు కొలస్ట్రార్ తగ్గిపోవడంతో పాటు శరీర ఆకృతిని అదుపులో ఉంచుతాయి. ఫిటినెస్‌గా ఉంటారు. కొలస్ట్రాల్‌ను తగ్గించడానికి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది. ఇంట్లోనే ఆడుతూ పాడుతూ ఈ వ్యాయామాల్ని చేయొచ్చు. ఇంటి మెట్లను ఐదునిమిషాల పాటు ఎక్కడం, దిగడం చేస్తే నడుము ఫిటెనెస్‌‌తో పాటు మంచి ఆకృతిని సంతరించుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu