Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డైటింగ్ చేద్దామంటే... ఆకలి చంపేస్తుందా?

డైటింగ్ చేద్దామంటే... ఆకలి చంపేస్తుందా?
, శుక్రవారం, 10 ఆగస్టు 2007 (15:03 IST)
డైటింగ్ చేస్తున్నామని తిండిమానేసి ఆకలి చంపేస్తుందని చెప్పేవారే ఎక్కువ. డైటింగ్ చేసే వారు ఆహారం మానేయడం సరికాదు. డైటింగ్ చేస్తున్నారా.. మీ కోసం ఆకలి తగ్గించే కొన్ని చిట్కాలు... సరైన పద్ధతిలో ఆహారం తీసుకుంటే ఆకలికాదని డైటీషియన్లు పేర్కొంటున్నారు. మనం తీసుకునే ఆహారంలో కేలరీలు ఎంత మాత్రం ఉన్నాయని దాని ప్రకారం తీసుకోవటం మంచిది. ఉదయం వేళ ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే అది రోజంతా ఆకలిని పెంచుతుంది.

కాబట్టి మీగడ తీసిన పెరుగు, పాలు ఉదయం తీసుకోవటం మంచిది. మధ్యాహ్నం సమయంలో పండ్లు, పచ్చి కూరగాయలను తీసుకోవడం ద్వారా ఆకలిని తగ్గించడంతో పాటు కేలరీలను అధికంగా శరీరానికి అందిస్తాయి. ఆహారాన్ని నిదానంగా నమిలి తినాలి. తిన్న తర్వాత నీటిని తాగండి. నీటికి ఆకలిని తగ్గించే గుణం ఉంది. శరీరం బరువు ఎక్కువగా కలిగి ఉన్నవారు నీటిని ఎక్కువగా తాగటంతో శరీర బరువు తగ్గుతుంది. నిద్ర తక్కువైతే ఆకలి కలుగుతుంది.

అందుకే ఎంత పని ఒత్తిడి ఉన్నా నిద్రకోసం సమయాన్ని కేటాయించాలి. శారీర వ్యాయామం చేసిన తర్వాత తీవ్రంగా ఆకలేస్తే సలాడ్‌లు తీసుకోవడం మేలు. దీనివల్ల ఆకలి తీరుతుందేగానీ శరీర బరువు పెరగదు. కొందరు ఏదో కారణంగా కొన్నిసార్లు భోజనం వేళను దాటేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా ఆకలి రెట్టింపవుతుంది. ఇలా చేయకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడానికి ప్రయత్నించండి.

Share this Story:

Follow Webdunia telugu