Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుక్లాంబర ధరం... విష్ణుం...!

శుక్లాంబర ధరం... విష్ణుం...!

Ganesh

, సోమవారం, 1 సెప్టెంబరు 2008 (19:53 IST)
FileFILE
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

తాత్పర్యం :
తెల్లని వస్త్రాలు ధరించిన వాడూ, అంతటా వ్యాపించి యున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహ దృష్టితోడి ముఖం గలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను.. ధ్యానించుచున్నాను.

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదంతమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

తాత్పర్యం :
పార్వతి (అగజ) ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైన సంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపవశ్రవస్తవం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతిః ఆన ష్రుణ్వన్నూతిభిః సీదసాదనం

తాత్పర్యం :
వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించువాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ మొదటగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు.

హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములలో, అన్ని ఆచారములలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యముగా జరుగుతుంటాయి. ఇకపోతే తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతన పూజా విధానంలో వినాయకుని పూజ కూడా ఒకటి. కాగా, పంచాయతన విధానములంటే... వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు లను పూజించే పూజా సంప్రదాయాలని అర్థం.

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు. ఈయన ఆకారం ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత గొడ్డలి, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక చేతిలో అభయహస్తము కలిగి ఉంటాడు వినాయకుడు. ఈయనను నమ్మిన వారికి సర్వమూ మంగళప్రదంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu