Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇల్లు బాగానే ఉంటుంది... కానీ ఇంట్లోవారి పరిస్థితి ఏమీ బాగోదు... వాస్తు దోషాలు, ఆ స్థలాలతో ఇబ్బందులు...

ఇంటి నిర్మాణం వాస్తుపరంగా లేకపోవడంతో ఏర్పడే దుష్పలితాలనే వాస్తు దోషాలుగా పరిగణించాలి. వాస్తు దోషాలనేవి ఎలా ఉంటాయో చూద్దాం. విపరీతంగా అప్పులు చేయడం, జీవితాంతం కష్టపడినా అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, మానసిక క్షోభ, తీరని వ్యధ, గలాటా

ఇల్లు బాగానే ఉంటుంది... కానీ ఇంట్లోవారి పరిస్థితి ఏమీ బాగోదు... వాస్తు దోషాలు, ఆ స్థలాలతో ఇబ్బందులు...
, సోమవారం, 11 జులై 2016 (14:53 IST)
ఇంటి నిర్మాణం వాస్తుపరంగా లేకపోవడంతో ఏర్పడే దుష్పలితాలనే వాస్తు దోషాలుగా పరిగణించాలి. వాస్తు దోషాలనేవి ఎలా ఉంటాయో చూద్దాం. విపరీతంగా అప్పులు చేయడం, జీవితాంతం కష్టపడినా అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, మానసిక క్షోభ, తీరని వ్యధ, గలాటాలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య జగడాలు, పిల్లలలకు విద్య సరిగా రాకపోవడం, రోగాలు, వ్యాపారాలు సరిగా జరగకపోవడం, మానసిక వ్యాకులత, గుండెపోటు, రక్తహీనత, భయం, అవమానాలు, బికారి కావడం, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఇల్లాలిపై విసుగు- కోపం, అసహ్యం, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, నిరుద్యోగం వంటివి. 
 
ఇక ఆడపిల్లల విషయంలో.. ఇతరులను ప్రేమించడం, లేచిపోవడం, పెళ్ళి అయిన తర్వాత అక్రమ సంబంధాలు, పుట్టింటికి చేరుకోవడం, పుట్టింటి వారికి బరువు కావడం, మెట్టినింట కష్టాలు ఎదుర్కొని, భర్త బలవంతంచే పుట్టినింటివారిని పీడించడం వంటివి జరుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
కాబట్టి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడమే కాదు... అందుకు కావలసిన స్థలాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. గృహ నిర్మాణానికి పనికిరాని స్థలాలను ఎంపిక చేసుకోకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. గృహనిర్మాణానికి పనికిరాని స్థలాలేమిటో ఒకసారి చూస్తే...
 
స్థలములోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.
 
చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో ఉండటం అసాధ్యం. 
డమరుకపు ఆకారంలో ఉండే స్థలము మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలు, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలము ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
స్థలము లోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది. కాబట్టి అన్నిరకాలుగా వాస్తు దోషం లేని స్థలాన్ని ఎంచుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరబ్బ సొమ్ము... ఎవరికి దానం... పుష్పగిరి మఠానికి శ్రీవారి స్థలం ధారాదత్తం!