Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణము ఉత్తరం కంటే ఎక్కువగా ఉంటే ఆడవారికే...!?

దక్షిణము ఉత్తరం కంటే ఎక్కువగా ఉంటే ఆడవారికే...!?
, శనివారం, 8 అక్టోబరు 2011 (16:16 IST)
FILE
దక్షిణ దిశకు గ్రహాధిపతి కుజుడు, పాలకుడు యముడు, వాహనం దున్నపోతు. దక్షిణమునకు గ్రహాధిపతి అంగారకుడు (కుజుడు). సాధారణంగా కుజ దోషమున్న వారికి దక్షిణ భాగం కూడా దోషం కలిగి ఉంటుంది. గురువర్గమునకు కుజుడు విశ్వాసపాత్రుడు. గురుగ్రహము సౌమ్యగ్రహము.

అత్యంత బలవంతుడైన శని గ్రహానికి గురుగ్రహము తట్టుకోలేనందువల్ల సర్వేశ్వరుడు కుజుని సృష్టి గావించాడు. శనికి తత్సమానమైన శక్తి కలిగినవాడు. దిక్కులలో శని పశ్చిమాన్ని ఆక్రమించగా, తత్సమానంగా కుజుడు దక్షిణాన్ని ఆక్రమించివున్నాడు.

సత్ఫలితాలు:
దక్షిణ దిక్కు ఉత్తరము కన్ననూ మెరక అయ్యి (ఎత్తు), ఏ గుంటలూ లేకుండగా, వంకర టింకర లేకుండగా ఉన్నచో ఆడవారికి చక్కటి ఆలోచనలు, వారి మాటలో బలము, మగవారికన్నా ఆడవారికే కాస్త గుర్తింపు ఎక్కువ.

స్పష్టత కలిగిన మాట, ఐశ్వర్యము, సమృద్ధిగా ధనము, రైతుల ఇళ్ళలో అయితే సమృద్ధిగా పాడి, కొత్త ఆస్థులు కొనుగోలు చేయడం, బంగారు కొనుగోలు చేయడం, వంటినిండా నగలు ధరించడం, జేబునిండా ధనం, ఆడపిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు కావడం, ఆడపిల్లలు విదేశాలకు వెళ్ళడం, మంచి దాంపత్య జీవనం లభించడం, తాంబూల సేవనం, ఎర్రగా పంపిన నోరు, పెదవులపై నవ్వు, సునిశిత దృష్టి, ఎదుటివారిని సరిగా అంచనా వేయడం, ఇచ్చిన అప్పులు త్వరగా వసూలు కావడం, చేస్తున్న వ్యాపారం త్వరగా అభివృద్ధి చెందడం తదితర శుభములు కలుగును.

దుష్ఫలితములు:
దక్షిణదిక్కు ఉత్తరముకన్ననూ పల్లముగా ఉన్నచో, వంకర టింకరగా ఉన్నచో, నైఋతి మూల లేక ఆగ్నేయమూలలోనో ఎక్కువగా పెరిగి గుంటలు, పెద్ద కాలువలు, వాలు వరండాలు, దక్షిణ నైఋతి భాగంలో వాకిళ్ళు తదితర దోషములు ఉన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు అనారోగ్య పీడితురాలై ఏ సుఖానికీనోచదు.

ధననష్టము, అనారోగ్యము, మానసికబాధ, ఉన్నది అమ్ముకోవడం, దుర్వ్యసనాలు, మరణాలు తదితరములు సంభవము. దక్షిణ భాగ విషయంలో జాగ్రత్తగా ఉన్నచో ఆర్థక పరిపుష్టి, ఇంటి ఇల్లాలు సుఖపడటం జరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu