Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తూర్పు స్థలంలో నివశించేవారి స్వభావం

తూర్పు స్థలంలో నివశించేవారి స్వభావం
, సోమవారం, 4 ఫిబ్రవరి 2008 (13:44 IST)
వాస్తును బట్టి ఆయా స్థలములందు నివశించువారి స్వభావము మరియు ఫలితములు ఎలా ఉంటాయనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. తూర్పు స్థలములో నివాసం ఉండేవారుకానీ లేదంటే జన్మించినవారు... నిర్మల స్వభావము, సాధువర్తనము, దయాగుణాలను, విశాల హృదయాన్ని కలిగివుంటారు. వీరి మనసులోని ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకోవటం చాలా కష్టమే.

దైవారాధన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు. పరిమళ ద్రవ్యములు, ప్రశాంతవాతావరణము వీరికి ఇష్టము. సాంఘిక కార్యకలాపములలో ప్రధానపాత్ర వహిస్తారు. తమ వాక్చాతుర్యముతో ఇతరులను ఆకర్షిస్తారు. నిరంతరము తమ భవిష్యత్ గురించి యోచిస్తారు. రాజకీయ సంబంధములుంటాయి. ఏ విషయాన్నైనా అంత తేలికగా మరిచిపోరు. అధిక జ్ఞాపక శక్తికలవారై తమ దైనందిన కార్యక్రమములను ప్రశాంతంగా నెరవేర్చుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu