Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తర, వాయువ్య దిశల్లో గుమ్మం ఉంటే.. ప్రేమలో పడతారట!

ఉత్తర, వాయువ్య దిశల్లో గుమ్మం ఉంటే.. ప్రేమలో పడతారట!
, మంగళవారం, 8 జనవరి 2013 (16:43 IST)
FILE
మీ ఇంట్లో గుమ్మం ఏ దిశలో ఉందో ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ ఉత్తర, వాయువ్య దిశలో గుమ్మం ఉంటే ఆ గృహ యజమాని సంతానం ప్రేమలో పడతారని వాస్తు నిపుణులు అంటున్నారు. ప్రేమ వలలో పడి ఎందరో యువత తమ జీవితాలు కోల్పోతున్నారు. అయితే మరి కొందరు ప్రేమతో ఏర్పడిన జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నారు. ఇందుకు కారణం కూడా వాస్తువేనని నిపుణులు చెబుతున్నారు.

ఉత్తర, వాయువ్య దిశలో ఇంటి ద్వారం ఉంటే ఆ ఇంట్లోని తొలి సంతానం ప్రేమ వివాహం చేసుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఆగ్నేయం వరకు పెరిగివుండే తూర్పు గోడ పక్కింటిని తాకితే ఆ గృహంలోని యువత ప్రేమలో పడతారని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఇంకా ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో కిటికీలు లేకుంటే కూడా ఆ ఇంట్లో ప్రేమ వివాహాలు జరుగుతాయి. అలాగే ఈశాన్యంలో వంటగది ఉండటం, వాయువ్య మూలలో వంటగది వుండి వాయువ్య దిశలో గుమ్మం ఉంటే ప్రేమతో చిక్కులు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu