Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగ్నేయము సరిగ్గా లేకపోతే పరాయి స్త్రీలపై మోజు ఎక్కువట!

ఆగ్నేయము సరిగ్గా లేకపోతే పరాయి స్త్రీలపై మోజు ఎక్కువట!
FILE
గృహము బయట ఆగ్నేయ భాగములో పల్లమున్నచో, గుంతలు, బావులు, కొలనులు ఉన్నచో అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ గృహము వారికి ఈశన్యము బాగుంటే ఇతరులను మోసం చేయడం, పరాయి స్త్రీలపై మోజు అధికంగా ఉండటం వంటి ఫలితాలుంటాయి.

ఈశాన్యము సరిగా లేకపోతే మోసగించబడటం, చివరికి ఆడవారి చేతిలో కూడా మోసపోవడం, పరాయి స్త్రీలపై విపరీతమైన కామవాంఛలు, వారిని అనుభవించాలనే ఆలోచనలు అధికం కావడం, వాటికై ప్రయత్నాలు, ఒక్కొక్కసారి ఇతరులకు దొరికిపోవడం వంటి దుష్ఫలితాలుంటాయి.

భార్య చక్కని చుక్క అయినప్పటీ ఇతరులపై మోజు తగ్గకపోవడం, అప్పడప్పుడు మద్యసేవనము, మాంసాహారం భుజించడం, విపరీతమైన కోపాన్ని కలిగి ఉండటం, కొన్ని సమయాల్లో భార్యను చితకబాదటం వంటివి చేస్తారు.

కొన్ని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు, ఆక్సిడెంట్లు, కాళ్ళు చేతులు విరగడం, విపరీతమైన ఆకలి, బాగా లావుకావడం వంటి అశుభఫలితాలు కలుగుతాయి. గృహము బయట ఆగ్నేయ భాగమునందు గుట్టలుండటం, కొండలుంటడం, బహుళ అంతస్థులు ఉండినట్లైతే దరిద్రము, ధననష్టము కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu