Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా...

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా...
WD
మనసు పొరలను ప్రేమ భావనలు తాకిన ఆ మధుర క్షణం...
మనసే మైమరచిపోయి ప్రేమ లోకంలో విహరించే ఆ క్షణం...
మనసు మందిరంలోని పూలతేరుపై ఊరేగే ఆ సమయం...
మదిలో మెదిలే ప్రియుడు చెంతలేని ఆ విరహం...
ఇలా జాలువారుతోంది...

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజా
మీ శ్రీచరణాంభుజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించి..
మీ గురించి...
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
చాయంగల విన్నపములూ

సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన...

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు
ఎన్నెనెన్నొ కథలు

జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో

నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా ప్రేమ లేఖ

ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసును నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి

తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే

ఇప్పుడే బదులివ్వండి
ఇప్పుడే బదులివ్వండి

సుప్రసిద్ధ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోని ఈ పాట నాడు ఎంతో ప్రజాదరణ పొందింది.

Share this Story:

Follow Webdunia telugu