Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ దరఖాస్తుకు చిట్కాలు

ప్రేమ దరఖాస్తుకు చిట్కాలు

WD

ప్రేమించడం సులభమే. కానీ ప్రేమను ప్రేమించే వారి ఎదుట వ్యక్తీకరించడమనేది... చాలా కష్టంతో కూడుకున్న పనిగా ప్రేమలో పండిపోయిన వారు చెప్తుంటారు. చెప్పడమెలాగా... అని మీరు ఆలోచిస్తుండగానే మీరు ప్రేమించిన వ్యక్తి, మరొకరి ప్రేమ దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే... కంగారు పడకండి... మీ విషయంలో అలా ముమ్మాటికి జరిగే అవకాశం లేదు. దిగువ పేర్కొన్న చిట్కాలను పాటించండి, మీరు ప్రేమిస్తున్న వారి చేత మీ ప్రేమ దరఖాస్తుకు డిస్టింక్షన్ మార్కులు కొట్టేసేయండి. ప్రేమ లోకంలో విహరించండి. పెళ్లి పీటలకు ఆర్డర్ ఇవ్వండి

1. మీ గర్ల్‌ఫ్రెండ్‌కు సముద్రం అంతర్భాగంలో ఈదులాడటం, పర్వతాలను అధిరోహించడం ఇష్టమని మీకు తెలిసింది. ఇంకేముంది... పర్వత శిఖరాన్ని చేరి ఆమెకు వినిపించేలా మీ మనసులోని మాటను బిగ్గరగా ప్రకటించండి. లవ్‌కు ఓకే చెప్తే సముద్రంలో జల పుష్పాల మధ్య పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేయండి.

2. మీరు అత్యంత ధైర్యం కలవారు అయితే, ఏదైనా భారీగా చేద్దామని అనుకున్నట్లయితే... మీలాంటి వారికోసమే ఈ చిట్కా. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమాకు వెళ్లాలని ప్లాన్ చేసుకోండి. ఇంటర్వెల్ సమయంలో మీదైన వీడియోను ప్రదర్శించగలిగే వ్యవస్థను సిద్ధం చేసుకోండి. వీడియో ద్వారా "జీవితాంతం కలిసి ఉందామా?" అని గర్ల్‌ఫ్రెండ్‌ను అడగండి.

3. మీ గర్ల్‌ఫ్రండ్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న తరుణంలో విమానంలోని ఇంటర్‌కామ్ ద్వారా మీ ప్రేమ ప్రతిపాదనను ఆమెకు వినిపించండి.

4. మీ గర్ల్‌ఫ్రండ్ ప్రతిరోజూ రాకపోకలు సాగించే రహదారిపై ఒక ప్రకటనల హోర్డింగ్‌ను అద్దెకు తీసుకోండి. ఉదాహరణకు ఆమె పేరు స్వప్న అయినట్లయితే హోర్డింగ్‌పై మంచి పెయింటర్‌తో ఇలా వ్రాయించండి... " స్వప్నా... నన్ను పెళ్లి చేసుకుంటావా?". మీ హోర్డింగ్ పూర్వక ప్రేమ దరఖాస్తుకు ముగ్దురాలై మీ ప్రియురాలు సంబరపడే అవకాశం ఉంది.

5. వర్షాకాలంలో చిటపట చినుకులు పడతుండగా మీ గర్ల్‌ఫ్రండ్‌ను షికారుకు తీసుకు వెళ్లండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పెళ్లి ప్రతిపాదనను ఆమె ముందు ఉంచండి.

Share this Story:

Follow Webdunia telugu